Aamir Khan: ఆ స్టార్ హీరో కుమార్తెకు పేరు పెట్టిన అమీర్ ఖాన్.. నెట్టింట ఫోటోస్ వైరల్!

Aamir Khan: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల కాలంలో తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా అమీర్ ఖాన్ సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలలో కూడా వార్తలు నిలుస్తూ వస్తున్నారు. ఒకవైపు సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే అమీర్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ సితారే జమీన్ పర్. ఈ సినిమా ఇటీవలే విడుదల అయ్యి సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు హీరో అమీర్ ఖాన్. ఇందులో భాగంగానే వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఫుల్ బిజీబిజీగా ఉన్నారు. ఇది ఇలా ఉంటే అమీర్ ఖాన్ తాజాగా ఒక కోలీవుడ్ స్టార్ హీరో కూతురికి నామకరణం చేశారు. ఆ హీరో మరెవరో కాదు కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్. ఈయన పలు సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న విషయం తెలిసిందే. కాగా విష్ణు విశాల్ బ్యాట్మెంటన్ ప్లేయర్ గుత్తా జ్వాలను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

వీరిద్దరికి ఈ ఏడాది ఏప్రిల్‌ లో పాప జన్మించింది. 2021లో ఈ జంట పెళ్లి చేసుకోగా నాలుగేళ్ల తర్వాత వీరి బిడ్డ పుట్టింది. అయితే తాజాగా వీళ్ల ఇంటికి బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ విచ్చేశారు. అంతేకాకుండా ఈ జంటకు జన్మించిన చిన్నారికి పేరు కూడా పెట్టారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు హీరో విష్ణు విశాల్. ఈ సందర్భంగా తమ కుమార్తెకు పేరు పెట్టినందుకు అమిర్‌ ఖాన్‌ కు ధన్యవాదాలు తెలిపారు. ఆ పాపకు మైరా అనే పేరుని నామకరణం చేసినట్టు తెలిపారు. మా మైరాని పరిచయం చేస్తున్నాను. మా బిడ్డకు పేరు పెట్టడానికి హైదరాబాద్ వచ్చినందుకు అమిర్ ఖాన్ సార్‌ కు కృతజ్ఞతలు అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన అభిమానులు బ్యూటీఫుల్ నేమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.