Acharya : “ఆచార్య” షూట్ లో చరణ్ పై వైరల్ గా మారిపోయిన మెగాస్టార్ వీడియో.!

Acharya : ఈ ఏప్రిల్ నెలలోనే రిలీజ్ కి రాబోతున్న మరిన్ని భారీ సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగా వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ భారీ సినిమా “ఆచార్య” కూడా ఒకటి.
అయితే ఇపుడు షూటింగ్ అంతా పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరి ఇదిలా ఉండగా ఈ భారీ సినిమా షూటింగ్ టైం లో జరిగిన ఓ ఘటనపై ఆసక్తికర వీడియో ని చిరు పోస్ట్ చెయ్యడం వైరల్ గా మారిపోయింది. ఈ రోజు హనుమాన్ జయంతి అందరికీ తెలిసిందే.
అయితే ఈ ప్రత్యేక దినాన ఇది పర్ఫెక్ట్ వీడియో అని చెప్పాలి.
ఇంతకీ ఇందులో ఏముందంటే ఈ సినిమా షూటింగ్ సమయంలో చిత్ర యూనిట్ మారేడుమిల్లి అడవుల్లో ఉన్న సంగతి తెలిసిందే.
అక్కడ రామ్ చరణ్ సినిమా కోసం రెడీ అవుతుండగా అనుకోకుండా తాను ఉన్న ఇంట్లోకి కోతి వచ్చేసింది. వచ్చి అది వెళ్లకపోగా రామ్ చరణ్ దగ్గరే ఉండి చూస్తూ ఉంది.
దీనితో రామ్ చరణ్ దానైకి ఏవో బిస్కెట్స్ లాంటివి ఏవో పెట్టగా అవి తీసుకొని అక్కడ తిని వెళ్ళిపోయింది.
అయితే దీనిని అంతటినీ వీడియో తీయగా దానిని ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా చిరు షేర్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసారు. దీనితో ఈ స్పెషల్ డే కి ఈ వీడియో మరింత ఆసక్తిగా మారింది.