మోహన్ బాబు గురించి ఎవ్వరికి తెలియని సీక్రెట్

మోహన్ బాబు అంటే ఇప్పుడు ‘ట్రోల్ల్స్’ కి కేర్ అఫ్ అడ్రస్ గా మారాడు కానీ, మోహన్ బాబు ఒక మంచి నటుడు. హీరో గా, విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ప్రొడ్యూసర్ గా మోహన్ బాబు గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనదైన ముద్ర వేసాడు.

‘స్వర్గం నరకం’ సినిమా తో కెరీర్ ప్రారంభించిన మోహన్ బాబు అనేక సూపర్ హిట్స్ సినిమాల్లో హీరో గా నటించి మెప్పించాడు. అయితే మోహన్ బాబు గురించి చాలా మందికి తెలియని విషయం ఒకటుంది.

మోహన్ బాబు కి రెండు పెళ్లిళ్లు జరిగాయి. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజుల్లోనే మోహన్ బాబుకి విద్యాదేవితో పెళ్ళి జరిగింది. వీరికి మంచు విష్ణు, లక్ష్మీ పుట్టారు. అయితే వరుసగా సినిమా అవకాశాలు వస్తుండటంతో మోహన్ బాబు బిజీ ఆర్టిస్ట్ గా మారారు. ఫామిలీ తో గడిపే టైం లేకపోవడంతో అది భార్య విద్యాదేవికి అంతగా నచ్చేది కాదట. ఈ క్రమంలో ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవలు జరిగాయట, దాంతో ఓరోజు ఆత్మ హత్య చేసుకుందట.

అయితే అప్పుడు విష్ణు, లక్ష్మీ చిన్నపిల్లలు కావడంతో పెద్దలు విద్యాదేవి సోదరి నిర్మలా దేవితో పెళ్ళి జరిపించారట. ఆ తర్వాత వీరికి మనోజ్ పుట్టాడు. ఇక నిర్మలా దేవి ఎలాంటి బేధభావం లేకుండా అక్క పిల్లలైన విష్ణు, లక్ష్మీలను కూడా మనోజ్ తో సమానంగా చూస్తోంది.