బిడ్డను కాపాడటానికి తన ప్రాణాలు పణంగా పెట్టిన తల్లి.. చివరికి ఏమైందంటే?

దేశంలో ప్రతిరోజు చోటు చేసుకుంటున్నా రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాలలో అభం శుభం తెలియని చిన్నారులు సైతం మరణిస్తున్నారు. ఇటీవల పిడుగురాళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి ప్రాణాలు కోల్పోగా చిన్నారి ప్రాణాలు కాపాడటానికి దూకిన అతని తల్లి తీవ్ర గాయాల పాలయ్యింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

వివరాలలోకి వెళితే…పిడుగురాళ్ల మండలం కామేపల్లికి చెందిన యేలూరి కొండ, యశోద దంపతులకు ఐదేళ్ల కుమార్తె, ఏడాదిన్నర వస్సున తేజ ఉన్నారు.ఇటీవలి కొండ, యశోద దంపతులు తమ పిల్లలతో కలిసి మొక్కు తీర్చుకునేందుకు ద్విచక్ర వాహనంపై తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడెంలోని జానపాడు దర్గా వద్దకు శుక్రవారం ఉదయం బయలుదేరారు.

ఈ క్రమంలో వీరు దాచేపల్లి మండలంలోని పొందుగుల బ్రిడ్జి వద్దకు చేరుకోగానే అక్కడ ఎత్తుగా ఉన్న స్పీడ్ బ్రేక్ మీదకి బండి వేగంగా ఎక్కించటంతో యశోద దగ్గరున్న తేజ జారీ కింద పడ్డాడు.వెంటనే యశోధ తన బిడ్డను కాపాడుకునే ప్రయత్నంలో తానూ బైక్‌ పై నుండి కిందికి దూకింది. అయితే వెనక నుండి వేగంగా వస్తున్న లారీ వీరి పైనుండి వెళ్లడంతో తేజ అక్కడిక్కడే మృతి చెందగా..యశోద తీవ్ర గాయాలపాలైంది. ఈ సంఘటన గమనించిన స్థానికలు యశోదనను పిడుగురాళ్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఆమెను గుంటూరుకు తరలించారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు పెట్టనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.