గత కొన్నాళ్ల కితం తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక మంది సినిమా ప్రముఖులపై డ్రగ్స్ కేసు విషయంపై ఎలాంటి కలకలం రేగిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత రీసెంట్ గా దర్శకుడు పూరీ హీరో రవితేజ లపై కూడా విచారణ జరగడం ఇండస్ట్రీ వర్గాల్లో కాక పుట్టించింది. సరే ఇది పక్కన పెడితే సోషల్ మీడియాలో మెగాస్టార్ అనే టైటిల్ ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.
మరి దీని వెనుక ఆంతర్యం ఏంటా అని చూస్తే ఆశ్చర్యకర అంశాలే బయట పడ్డాయి. మొదటగా మెగాస్టార్ అంటే మన తెలుగు మెగాస్టార్ చిరంజీవి కాదు. హిందీ సినిమాకి చెందిన ఓ సీనియర్ స్టార్ హీరోని కూడా మెగాస్టార్ అంటారు. ఆ మెగాస్టార్ కొడుకే ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఇరుకోవడం సంచలనంగా మారింది. ముంబైలో ఈ ఘటన చోటు చేసుకుంది.
బాగా డబ్బున్నవారు కొందరు రేవ్ పార్టీ ప్లాన్ చేసుకొని డ్రగ్స్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తుండగా ముంబై మాదక ద్రవ్యాల శాఖ వారు దాడులు జరిపి ఓ పది మందిని పెట్టుకోగా వారిలో ఆ మెగాస్టార్ కొడుకు కూడా ఉన్నాడని కన్ఫర్మ్ చేశారు. పైగా వారికి బ్లడ్ టెస్ట్ చేసి చూస్తే రిజల్ట్ కూడా డ్రగ్స్ తీసుకున్నారనే రావడంతో వారిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి మాత్రం బాలీవుడ్ లో ఈ ఘటన సంచలనంగా మారింది.