కార్మిక చట్టాల్లో కీలక మార్పు … వారంలో నాలుగు రోజులే పని !

కొత్త కార్మిక చట్టాల్లో కార్మికుల పనిగంటలు తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. కేంద్ర కార్మిక‌, ఉపాధి మంత్రిత్వ శాఖ‌. ఈ కొత్త కోడ్ ప్ర‌కారం ఇక కంపెనీలు వారానికి నాలుగు రోజుల పాటే ఉద్యోగుల‌తో ప‌ని చేయించుకునే వీలు క‌లుగుతుంది. అయితే వారానికి మొత్తం ప‌ని గంట‌లు మాత్రం 48గానే ఉండ‌నున్నాయి.

Image result for employee indian

ఈ లెక్క‌న ఒక‌వేళ కంపెనీలు నాలుగు రోజులు ప‌ని, మూడు రోజులు పెయిడ్ లీవ్స్ ఇవ్వాల‌ని అనుకుంటే.. ఆ నాలుగు రోజుల్లో రోజుకు 12 గంట‌ల పాటు ఉద్యోగుల‌తో ప‌ని చేయించుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఉద్యోగుల అనుమ‌తితోనే అని కార్మిక‌, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్య‌ద‌ర్శి అపూర్వ చంద్ర వెల్ల‌డించారు. వారానికి ఎన్ని రోజులు ప‌ని అన్న విష‌యంలో తాము ఎవ‌రినీ ఒత్తిడి చేయ‌డం లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

అయితే ఈ కొత్త కోడ్ వ‌ల్ల కంపెనీలు, ఉద్యోగుల‌కు ప‌ని చేసే రోజుల్లో కాస్త వెసులుబాటు క‌లుగుతుంద‌ని అపూర్వ చంద్ర చెప్పారు. ఈ కొత్త కోడ్ ముసాయిదా నిబంధ‌న‌లు చివ‌రి ద‌శ‌లో ఉన్నాయ‌ని, చాలా వ‌రకూ రాష్ట్రాలు కూడా త‌మ సొంత నిబంధ‌న‌లు రూపొందించే ప్ర‌క్రియ‌లో ఉన్నాయ‌ని తెలిపారు.ఈ కొత్త కోడ్ వ‌స్తే ప‌ని రోజులు వారానికి ఐదు కంటే కూడా త‌గ్గ‌వ‌చ్చని చెప్పారు. 4,5,6 అనేది కంపెనీలు, ఉద్యోగులు తీసుకోవాల్సిన నిర్ణ‌య‌మ‌ని అపూర్వ చంద్ర తెలిపారు.

ఈ ఏడాది జూన్ నాటికి అసంఘ‌టిత రంగ కార్మికులు రిజిస్ట‌ర్ చేసుకోవ‌డానికి, ఇత‌ర ప్ర‌యోజ‌నాల కోసం ఓ వెబ్ పోర్ట‌ల్ ప్రారంభించనుంది. ఈ విధంగా చూస్తే కార్మికులు వారంలోని నాలుగు రోజులలో 48 గంటలు పనిచేయవచ్చు. అంటే వారంలో నాలుగు రోజుల్లో ప్రతిరోజూ 12 గంటలు పనిచేసి, మూడు రోజులు విశ్రాంతి తీసుకోవచ్చు. అయితే ఈ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు ప్రతిరోజూ 8 గంటలకు బదులుగా 12 గంటలపాటు పని చేయాల్సివుంటుంది.