Crime News: మన భారతీయ సంస్కృతిలో పెళ్లికి ఒక ప్రత్యేకత ఉంది. పూర్వకాలంలో మూడుముళ్ల బంధంతో ఒకటైన దంపతులు వారి మధ్య ఎన్ని మనస్పర్థలు వచ్చిన సర్దుకుపోయి తుది శ్వాస వరకు కలిసి ఉండేవారు. కానీ ప్రస్తుత కాలంలో పెళ్లి అంటే ఒక బొమ్మలాటగా మారిపోయింది. వివాహ బంధానికి విలువ లేకుండా పోయింది. భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు సర్దుకుపోయే స్వభావం లేకుండా అనేక కారణాలవల్ల విడిపోతున్నారు. కుటుంబ కలహాలు వివాహేతర సంబంధాలు ఇలా ఎన్నో కారణాలు కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. తాజాగా అటువంటి సంఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది.
వివరాలలోకి వెళితే ..గుజరాత్లోని ఆరవల్లి జిల్లాలోని ములోజ్ గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.గ్రామానికి చెందిన లాలా పాగీ (47), శారదాబెన్ కు (43) ఇరవై ఏళ్ల క్రితం వివాహమైంది. దంపతులిద్దరి మధ్య తరచూ వివాదాలు జరుగుతూ ఉండేవి. లాలా పాగీ తరచూ భార్యను వేధిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఇద్దరి మద్య గొడవ జరగటంతో శారదబెన్ కొద్దిరోజుల క్రితం తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఇలా తన భార్య తనని వదిలి పుట్టింటికి వెళ్ళటంతో లాలా పాగీ తీవ్ర ఆగ్రహానికి గురై భార్యని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఈ తరుణంలో గురువారం రాత్రి తన భార్య ఉంటున్న బీటీ ఛప్రా గ్రామానికి వెళ్లాడు. భర్త రావటంతో శారాదబెన్ సంతోషంగా తన భర్తన హత్తుకుంది. అంతే కొన్ని సెకన్లలో ఇద్దరు బూడిద అయిపోయారు. లాలా పాగీ తన భార్యని చంపటం కోసం శరీరానికి పేలుడు పదార్థాలు(జిలెటిన్ స్టిక్స్) చుట్టుకుని వెళ్ళాడు. భార్య తనని హత్తకొగనే డిటోనేటర్ నొక్కాడు. వెంటనే పెద్ద ఎత్తున పేలుడు సంభవించటంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు
ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని ఈ ఘటనకు సంబంధించి నిందితుడికి పేలుడు పదార్థాలు ఎవరు సరఫరా చేశారు అన్న కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు.