Balayya : లేటెస్ట్ అప్డేట్ : బాలయ్య భారీ సినిమాలో కన్నడ సెన్సేషనల్ నటుడు!

Balayya : నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “అఖండ” ఇండస్ట్రీలో ఎంత పెద్ద విజయాన్ని నమోదు చేసిందో చూసాం. 30 రోజులు గడిచినప్పటికీ కూడా హౌస్ ఫుల్స్ ఈ సినిమాకి పడుతున్నాయి. ఇక ఈ సినిమా హిట్ తర్వాత మళ్ళీ గ్రాఫ్ లో ఊపొచ్చింది. మరిన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్ లు ఒకే చేస్తూ బాలయ్య అదరగొడుతున్నాడు.

అలా మన టాలీవుడ్ మరో మాస్ దర్శకుడు గోపిచంద్ మలినేని తో ఓ భారీ సినిమా ని బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ తో అనౌన్స్ చేసారు. మరి ఇదిలా ఉండగా ఇప్పుడు వీరి నుంచే బాలయ్య సినిమాపై లేటెస్ట్ అప్డేట్ రివీల్ చేశారు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన సెన్సేషనల్ నటుడు దునియా విజయ్ ని ఈ సినిమాలో కీలక పాత్రకి ఎంపిక చేసినట్లు గా ఇప్పుడు రివీల్ చేశారు.

మరి ఇది చూస్తుంటే ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్రకి ఏమో అనిపిస్తుంది. మొత్తానికి మాత్రం బాలయ్య 107వ సినిమా నుంచి ఈ కొత్త అప్డేట్ వచ్చింది. అలాగే ఇంకో బిగ్ అప్డేట్ ను కూడా చిత్ర బృందం ఇప్పుడు 11 గంటలకు ఒకటి రివీల్ చేస్తామని తెలిపారు. అలాగే ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.