Valimai Telugu Trailer Launch : తెలుగులో “వలిమై” ట్రైలర్ కి అదిరే సెంటిమెంటల్ ప్లానింగ్ వేసారుగా.!

Valimai Telugu Trailer Launch : కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన బిగ్ స్టార్స్ లో థలా అజిత్ కుమార్ కూడా ఒకరు. మరి అజిత్ హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రమే “వలిమై”. దర్శకుడు హెచ్ వినోత్ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా విడుదలకి సిద్ధం అవుతుంది. మరి ఈ సినిమా నుంచి తమిళ్ వెర్షన్ ని గాను ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ అయ్యి భారీ స్థాయి రెస్పాన్స్ ని కొల్లగొట్టిన సంగతి తెలిసిందే.

ఇంకా ఏకంగా హాలీవుడ్ లెవెల్ సినిమాలతో పోలుస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో మేకర్స్ రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తుండగా.. మన తెలుగులో కూడా మంచి బజ్ ని అయితే ఈ చిత్రం సంతరించుకుంది. ఇక ఇప్పుడు ఈ భారీ సినిమా ట్రైలర్ లాంచ్ కి అదిరే ప్లానింగ్ వేశారని చెప్పాలి.

మన తెలుగులో బిగ్ స్టార్ అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఈ రోజు సాయంత్రం ఈ ట్రైలర్ ని లాంచ్ చేయిస్తున్నట్టుగా ప్రకటించడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ సినిమాకి ఇది గొప్ప మైలేజ్ ని కూడా ఇచ్చే ప్లానింగ్ అని చెప్పాలి. అలాగే మహేష్ చేతులు మీదగా విడుదల అయ్యిన ట్రైలర్స్ గాని ఆ సినిమాలు గాని ఆల్ మోస్ట్ హిట్ అయ్యినవే ఉన్నాయి.

సో ఇలా కూడా సెంటిమెంట్ ఈ చిత్రానికి పనికొస్తుంది. మరి సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు వచ్చే ఈ ట్రైలర్ తెలుగులో ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాలో హుమా ఖురేషి ఫీమేల్ లీడ్ లో నటించగా బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మాణం వహించారు. అలాగే యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.