Home News 30 రోజుల్లో ప్రేమించటం ఎలా ట్రైల‌ర్ విడుద‌ల‌..ఇది చూస్తుంటే హిట్ కొట్టేలా ఉన్నాడే!

30 రోజుల్లో ప్రేమించటం ఎలా ట్రైల‌ర్ విడుద‌ల‌..ఇది చూస్తుంటే హిట్ కొట్టేలా ఉన్నాడే!

బుల్లితెర‌పై త‌న చ‌లాకీ మాట‌ల‌తో ప్రేక్షకుల‌ని ఎంట‌ర్‌టైన్ చేస్తున్న ప్ర‌దీప్ మాచిరాజు ఇప్పుడు వెండితెర‌పై కూడా అల‌రించేందుకు సిద్ధ‌మ‌య్యాడు. మున్నా అనే కొత్త ద‌ర్శ‌కుడి ద‌ర్శ‌క‌త్వంలో 30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా అనే చిత్రాన్ని చేయ‌గా, ఇందులో అమృతా నాయ‌ర్ క‌థానాయిక‌గా న‌టించింది. గ‌త ఏడాది విడుద‌ల కావ‌ల‌సిన ఈ సినిమా క‌రోనా వ‌ల‌న ఆగింది. ఎట్ట‌కేల‌కు ఈ సినిమాని జ‌న‌వ‌రి 29న గీతా ఆర్ట్స్, యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా విడుద‌ల చేస్తున్నాయి.

30 Rojullo | Telugu Rajyam

కొద్ది రోజులుగా చిత్ర ట్రైల‌ర్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్ష‌కుల‌ని మేక‌ర్స్ స‌ర్‌ప్రైజ్ చేశారు. రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ చేతుల మీదుగా 30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో ఫ‌న్‌, ఎమోష‌న్, ట్రాజెడీ, కామెడీ స‌మ‌పాళ్ళ‌లో ఉన్నాయ‌ని అర్ధ‌మ‌వుతుంది. లవ్ స్టోరీకి పునర్జన్మల నేపథ్యం జోడించి ఈ సినిమా తెరకెక్కించాడు కొత్త దర్శకుడు మున్నా. ఆ జన్మలో కలవని జంట.. ఈ జన్మలో ఎలా కలిసారనే కాన్సెప్టుతో సినిమా వస్తుంది.

30 రోజుల్లో ప్రేమిచ‌టం ఎలా అనే దానిని సినిమాలో స‌రికొత్త‌గా చెప్పేందుకు ద‌ర్శ‌కుడు మున్నా ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఆయ‌న ప్ర‌య‌త్నం త‌ప్ప‌క విజ‌య‌వంతం అవుతుంద‌ని ట్రైల‌ర్ చూస్తుంటే అర్ద‌మ‌వుతుంది. హీరోయిన్‌గా న‌టించిన అమృతా నాయ‌ర్ గ్లామ‌ర్‌తోను అద‌ర‌గొట్ట‌నుంది. నీలినీలి అనే ఆకాశం అనే పాట సినిమాకు ఫుల్ హైప్ తీసుకురాగా, ఇప్పుడు ట్రైల‌ర్ కూడా మూవీపై భారీ అంచ‌నాలే పెంచింది. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం మీరు ఈ ట్రైల‌ర్ చూసి ఎంజాయ్ చేయండి.

 

- Advertisement -

Related Posts

మూడో కూటమిగా కమల్‌హాసన్-శరత్‌ కుమార్… రంజుగా మారుతున్న తమిళ రాజకీయం!

చెన్నై: డీఎంకే కూటమి నుంచి నటుడు శరత్‌ కుమార్‌ బయటకు వచ్చి కమల్‌హాసన్ స్థాపించిన మక్కల్‌ నీది మయ్యం పార్టీతో కలిసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తమిళనాడు రాజకీయాలలో రోజురోజుకు వేడి...

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు … మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానంలో బరిలో 93 మంది !

తెలంగాణలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు ఫైనల్ అయ్యారు. నామినేషన్ల పరిశీలనలో కొంతమంది నామినేషన్లు రిజక్ట్ కాగా , నామినేషన్ల ఉపసంహరణలో కొంతమంది విత్ డ్రా చేసుకున్నారు. మహబూబ్‌నగర్-...

పబ్లిసిటీ పీక్… మ్యాటర్ వీక్ అంటూ జగన్ మీద లోకేష్ సెటైర్లు

ఆంధ్ర ప్రదేశ్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్ చేస్తూ హై కోర్ట్ ఉత్తర్వులివ్వటంతో రాజకీయ పార్టీలన్నీ వ్యూహ రచనలో మునిగిపోయాయి. మున్సిపల్ ఎన్నికలు అంటే దాదాపు పట్టణ జనాభా అధికంగా ఉండేవే...

మంత్రులు ఇరుక్కుంటున్నారా లేక ఎవరైనా ఇరికిస్తున్నారా ?

వైసీపీ మంత్రులు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు హైలెట్ అవుతూ ఉంటారు.  సీజన్ ప్రకారం ఈ టైమ్ ఒకరు ఈ టైమ్ ఇంకొకరు అంటూ వార్తలూ నిలుస్తూ వస్తున్నారు. టైం టేబుల్ వేసుకున్నట్టు ఒక్కొక్కరిగా వార్తలకెక్కుతున్న...

Latest News