Sree Vishnu: మామూలుగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన కథను మరొక హీరో చేయడం అన్నది కామన్. అలా రిజెక్ట్ చేసిన సినిమాలు కొన్ని మంచి సక్సెస్ ను సాధిస్తే మరి కొన్ని ఫ్లాప్ అవుతూ ఉంటాయి. ప్లాపు అయిన సినిమాలతో పోల్చుకుంటే సక్సెస్ అయిన సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. అలా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అటువంటి సినిమాలలో ఇప్పుడు తెలుసుకోబోయే సినిమా కూడా ఒకటి.
అయితే తాజాగా రిలీజ్ అయిన ఒక హిట్ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. ఈ సినిమాను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 మంది హీరోలు రిజెక్ట్ చేశారట. ఫైనల్ గా ఆ కథను టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు ఒకే చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఆ సినిమా మరేదో కాదు సింగిల్. యూత్ ఫుల్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్, కాల్య ఫిల్మ్స్ నిర్మించగా డైరెక్టర్ కార్తీక్ రాజు ఈ మూవీని తెరకెక్కించారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన కేతిక శర్మ, ఇవానా హీరోయిన్స్ గా నటించారు.
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమా ఏకంగా రూ.25 కోట్లకు పైగా వసూళ్లు సాదించి భారీ లాభాలను తెచ్చిపెట్టింది. అయితే సింగిల్ సినిమా కథను ఇండస్ట్రీలో ఉన్న దాదాపు 15 మంది హీరోలు రిజెక్ట్ చేశారట. ఈ విషయాని హీరో శ్రీ విష్ణునే చెప్పుకొచ్చాడు. ఈ కథను దర్శకుడు కార్తీక్ రాజు మూడేళ్ళ క్రితమే చెప్పాడు. అంతకుముందు ఇదే కథను 15 ముందుకి చెప్పాడట. కానీ వాళ్ళు రిజెక్ట్ చేశారు. వాళ్ళు రిజెక్ట్ చేయడం మంచిదే అయ్యిందట. వాళ్లందరికి నా థాంక్స్ అని చెప్పుకొచ్చారు హీరో శ్రీ విష్ణు.
అలా ఒక సూపర్ హిట్ సినిమాను మిస్ అయ్యారు 15 మంది హీరోలు. ఇకపోతే హీరో శ్రీ విష్ణు సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన మృత్యుంజయ, కామ్రేడ్ కళ్యాణ్ అనే రెండు సినిమాలు చేస్తున్నాడు. ఫాంటసీ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో వస్తున్న మృత్యుంజయ మూవీ షూటింగ్ ఇప్పటికే మొదలవగా కామ్రేడ్ కళ్యాణ్ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలయ్యింది. సరికొత్త కథలతో వస్తున్న ఈ రెండు సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి ఈ సినిమాలు శ్రీ విష్ణుకీ ఏ మేరకు గుర్తింపు తెచ్చి పెడతాయో చూడాలి మరి..
Sree Vishnu: 15 మంది హీరోలు రిజెక్ట్ చేసిన మూవీకీ ఓకే చెప్పిన శ్రీవిష్ణు.. కట్ చేస్తే అలా?
