సమంత ‘కల’ అలా కరిగిపోయింది.? కారణమేంటి

అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత చాలా చాలా తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. మీడియాలో జుగుప్సాకరమైన కథనాలు, అంతకన్నా దారుణమైన రీతిలో సోషల్ మీడియాలో ట్రోలింగ్.. వెరసి, ఈ నెగెటివిటీ నుంచి బయటపడటం సమంతకి ఇప్పట్లో సాధ్యమయ్యే పనేనా.? అన్న చర్చ నడుస్తోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌‌గా వుండే సమంత, వీలైనంతవరకు తన మీద వస్తున్న నెగెటివిటీని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోంది.. తన అభిప్రాయాల్ని కుండబద్దలుగొడుతోంది, తన మీద వస్తున్న గాసిప్స్‌పై వివరణ ఇస్తోంది. అయినా, నెగెటివిటీ తగ్గడంలేదు.

తాజాగా, అబార్షన్ సహా పలు అంశాలపై సమంత ఆవేదన వ్యక్తం చేసిన విషయం విదితమే. మరోపక్క, సమంత గురించి ఆమె సన్నిహితులూ పెదవి విప్పుతున్నారు. సినిమాల కంటే వ్యక్తిగత జీవితానికే సమంత ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేదనీ, ఓ బిడ్డకు తల్లి అవ్వాలనుకుందనీ, ఈ క్రమంలో కొన్ని సినిమాల్నీ వదులుకుందనీ ఆమె సన్నిహితులంటున్నారు. ఇంతలోనే, ఇలా అక్కినేని నాగచైతన్య – సమంత విడాకుల ఎపిసోడ్ తెరపైకి రావడాన్ని వాళ్ళెవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.

అయితే, అసలు విడాకులకు కారణమేంటి.? అన్నది మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే సమంత – నాగచైతన్యలది అన్యోన్య దాంపత్యం. ఇద్దరి మధ్యా అభిప్రాయ బేధాలున్నట్టుగా వారిద్దరూ ఎలాంటి అనుమానాలకూ తావివ్వలేదు మరి విడాకుల వరకూ. నాగచైతన్యతో వైవాహిక బంధంలో తల్లి కావాలనుకున్న సమంత ‘కల’ నెరవేరకపోవడానికి