మేం చెప్పిందే నిజం అయ్యిందిగా..మహేష్ సినిమా నిడివి బయటకి వచ్చేసింది.!

Sarkaru Vaari Paata  : తెలుగు సినిమా దగ్గర ఆల్ టైం అందగాడు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం “సర్కారు వారి పాట” కోసం అభిమానులు ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిన్న ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. ఇక దీనితో ఇక్కడ నుంచి చిత్ర బృందం మరింత జోరు కనబరుస్తున్నారు.

అయితే ఇంకా ఈ సినిమా సెన్సార్ కి సంబంధించి ఇంకా అధికారిక అప్డేట్ రాకముందే మేము ఈ సినిమా నిడివి ఎంత ఉంటుందో ఏ సర్టిఫికెట్ ఇచ్చారో చెప్పాము. మరి ఇప్పుడు దీనిని నిజం చేస్తూ మేకర్స్ అధికారిక అప్డేట్ ని వారు ఇచ్చారు. ఈ సినిమాకి సెన్సార్ నుంచి యూ బై ఏ సర్టిఫికెట్ రాగా మేము చెప్పినట్టుగానే 160 నిమిషాల నిడివిలోనే ఈ చిత్రం వచ్చింది.

మొత్తం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు టైటిల్ కార్డ్స్ తో కలిపి 162 నిమిషాల 25 సెకన్లు కట్ కన్ఫర్మ్ అయ్యినట్టుగా నిర్మాతలు ఆ సర్టిఫికెట్ ని రిలీజ్ చేశారు. సో ఈ మెంటల్ మాస్ సినిమా ట్రీట్ ఇంతసేపు గ్యారెంటీ అని చెప్పాలి. ఇంకా ఈ సినిమాలో మహేష్ బాబుతో మొదటి సారి కీర్తి సురేష్ హీరోయిన్ గా జత కట్టగా నదియా సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మే 12న రిలీజ్ అవుతుంది.