మెగాస్టార్ మీద ఆశలు వదుకుకోలేకున్న వినాయక్

VV Vinayak pin hopes on Megastar Chiranjeevi
VV Vinayak pin hopes on Megastar Chiranjeevi
వి.వి.వినాయక్… ఒకప్పుడు స్టార్ డైరెక్టర్.  కాలక్రమంలో ఫేడ్ అవుట్ అయ్యారు.  వరుస ఫ్లాపులు ఆయన్ను మరింత వెనక్కు నెట్టడం జరిగింది.  ప్రస్తుతం ఆయన చేతిలో భారీ ప్రాజెక్ట్స్ ఏవీ లేవు.  పెద్ద హీరోల డేట్స్ అసలే లేవు.  కొన్ని నెలల క్రితం మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినట్టే వచ్చి మిస్ అయిపోయింది.  మలయాళం హిట్ మూవీ ‘లూసిఫర్’ను మెగాస్టార్ రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యాక ముందు సుజీత్ అనుకున్నా తర్వాత వినాయక్ లైన్లోకి రావడం జరిగింది.  వినాయక్ కథ మీద కూర్చుని మార్పులు చేర్పులు చేయడం స్టార్ట్ చేశారు.  మరి ఆ ట్రీట్మెంట్ నచ్చలేదో ఏమో కానీ చిరంజీవి సినిమాను తీసుకెళ్లి మోహన్ రాజా చేతిలో పెట్టారు.  దీంతో వినాయక్ ఖాళీ అయ్యారు. 
 
అలాగని వినాయక్ మీద చిరంజీవికి నమ్మకం లేదా అంటే ఉంది.  ఆ నమ్మకం ఉండబట్టే రీఎంట్రీ చిత్రం ‘ఖైదీ నెం150’ బాధ్యతలను ఆయనకు అప్పగించారు.  సో… ‘లూసిఫర్’ రీమేక్ విషయంలో వినాయక్ ట్రీట్మెంట్ మాత్రమే చిరుకు నచ్చలేదు.  అయినా చిరంజీవితో ఇంకొక సినిమా చేయాలనే కోరికతో ఉన్న వినాయక్ అంతటితో ఆగిపోలేదు. కొత్త కథ రాసుకున్నాడట. ఆ కథను తీసుకెళ్లి చిరంజీవికి వినిపించారట.  అయితే చిరంజీవి నుండి ఇంకా ఎలాంటి అప్డేట్  రాలేదట ఆయనకు.  చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడప్పుడే ఇంకో కొత్త సినిమాకు కమిట్ అవ్వడం ఎందుకని చిరంజీవి ఆలోచించి ఉండవచ్చు.  మరి ఈసారైనా ఆయన కోరిక నెరవేరుతుందేమో చూడాలి.