మార్నింగ్ షో టాక్ : ‘గాలి సంపత్’.. చెప్పినంత లేదట

Gaali Sampath
 
Gaali Sampath
 
ఈరోజు రిలీజైన మూడు సినిమాల్లో ‘గాలి సంపత్’ మీదనే అంచనాలు తక్కువ.  మిగతా రెండు సినిమాలు ప్రమోషన్లతో ఆదరగొట్టగా ఈ సినిమా మాత్రం అంతగా అటెంక్షన్ అందుకోలేకపోయింది.  రాజేంద్రప్రసాద్, శ్రీవిష్ణుల క్రేజ్ మీదనే సినిమాకు టికెట్లు తెగాయి.  టీజర్, ట్రైలర్లు పర్వాలేదనిపించినా ప్రమోషన్లు అంతగా ఆకట్టుకోలేదు.  ఓపెనింగ్స్ విషయంలోనూ ఈ చిత్రం మిగతా రెండు సినిమాల కంటే వెనుకబడింది.  ఇక సినిమాలో కంటెంట్ విషయానికొస్తే అది కూడ మిగిలిన రెండు సినిమాల కంటే తక్కువే అనాలి.  
 
మొదటి నుండి అంటున్నట్టు రాజేంద్రప్రసాద్ చేసిన గాలి సంపత్ పాత్ర అందులో ఆయన నటనే సినిమాకు హైలెట్.  తండ్రి కొడుకుల మధ్యన ఉండే ఎమోషన్స్ కొన్ని బాగున్నాయి.  తన ఆశయానికి అడ్డు వస్తున్నాడని తండ్రికే కొడుకు దూరం అవ్వాలని అనుకోవడం, తనలోని భయాన్ని పొగొట్టుకోవడానికి గాలి సంపత్ చేసే ప్రయత్నాలు బాగుంటాయి.  నోట్లోంచి ఉఫ్ ఉఫ్ అనే గాలి తప్ప ఇంకో మాటరాని పాత్రలో రాజేంద్రప్రసాద్ నటన బాగుంది.  మాట పోవడంతో అతను పడే ఆవేదన ప్రేక్షకులకు కనిపిస్తుంది.  
 
ఇక ఈ కొర్ ఎమోషన్ పైన చెప్పుకున్నట్టు కొన్ని చోట్ల బాగున్నా చాలా చోట్ల మరీ ఓల్డ్ అనిపించింది.  సెకండాఫ్ కథనం కూడ స్లోగానే ఉంది.  గాలి సంపత్ పాత్రలో కామెడీ పండించడానికి చేసిన ప్రయత్నం సఫలం కాలేదు.  మొత్తంగా గాలి సంపత్ అక్కడక్కడా మినహా పూర్తిస్థాయిలో అయితే అలరించలేదనే అనాలి.