చరణ్ ఆ దర్శకుడితో సినిమా చెయ్యట్లేదు

Ram Charan not working with Gautham Tinnanuri

Ram Charan not working with Gautham Tinnanuri

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కంప్లీట్ అవ్వగానే శంకర్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే అంతకు ముందే ఆయన గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ఒక సినిమా చేస్తారనే వార్తలు నడిచాయి. ‘జెర్సీ’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న గౌతమ్ అదే సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. అతని పనితనం నచ్చి సినిమా చేయడానికి చరణ్ సుముఖత చూపించారని, కథా చర్చలు నడుస్తున్నాయని జోరుగా వార్తలొచ్చాయి.

కానీ ఈలోపే చరణ్ శంకర్ దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో గౌతమ్ సినిమా సంగతేమిటనే ప్రశ్న మొదలైంది. దీనికి గౌతమ్ తిన్ననూరి ఆన్సర్ ఇచ్చేశారు. ప్రజెంట్ తాను ‘జెర్సీ’ హిందీ వెర్షన్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నానని, అలాగే తర్వాతి సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడ చేస్తున్నానని, బౌండ్ స్క్రిప్ట్ పూర్తయ్యాకనే ఆ కథకు సరిపోయే హీరోను కలిసి కథ వినిపిస్తానని అన్నారు. దీన్నిబట్టి అసలు గౌతమ్ చరణ్ వరకు వెళ్లలేదని, వారి మధ్యన ఎలాంటి చర్చలూ జరగలేదని రూఢీ అయింది.