క‌రోనా డేంజ‌ర్ బెల్స్.. ఏపీలో ఒక్క‌రోజే రికార్డు స్థాయిలో మ‌ర‌ణాలు..!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైర‌స్ వ్యాప్తి తీవ్ర‌స్థాయికి చేరుకుంటుంది. ఏపీ ప్ర‌భుత్వం అన్ని ర‌కాలుగా చ‌ర్య‌లు తీసుకుంటున్నా, రాష్ట్రంలో ప్ర‌తిరోజు పెద్ద ఎత్తున క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇక తాజాగా గ‌త 24 గంటల్లో ఏపీలో 1,935 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, 1,030 క‌రోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఆందోళ‌ణ‌క‌ర‌మైన విష‌యం ఏంటంటే.. రికార్డు స్థాయిలో ఒక్క‌రోజే ఏపీలో 37 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో కరోనా వ్యాధి సోకి మ‌ర‌ణించిన వారి సంఖ్య 365కు చేరుకుంది. ఇక ఓవరాల్‌గా ‌చూసుకుంటే ఏపీ ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 31,103కు చేరుకుంది. క‌రోనా బారిన ప‌డి 16,464 మంది కోలుకోగా, 14,274 మంది క‌రోనా పేషెంట్లు వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.