పుష్ప’కు మధ్యలో ‘ఐకాన్’ వచ్చేసింది !

Allu Arjun will do ICON after Pushpa part one

Allu Arjun will do ICON after Pushpa part one

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుసగా చాలా సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ఆయన సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ చేస్తున్నారు. ఈ సినిమాను రెండు భాగాలుగా చేయాలని ఇటీవలే డిసైడ్ చేశారు.  దీంతో అల్లు అర్జున్ ప్లాన్స్ కూడ మారాయట.  ‘పుష్ప-1’ ముగింపు దశలో ఉంది.  అది పూర్తికాగానే సెకండ్ పార్ట్ మొదలుపెట్టడానికి కాస్త టైమ్ పట్టేలా ఉంది. అందుకే ఈలోపు ‘ఐకాన్’ చిత్రాన్ని మొదలుపెట్టాలని అనుకుంటున్నారట.  అంటే ‘పుష్ప-1’ తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ ఆతర్వాత ‘పుష్ప-2’ చేస్తారన్నమాట. 

ఇక బన్నీ చాలా నెలల క్రితమే కొరటాల శివ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నారు.  సుకుమార్ సినిమా తర్వాత ఇదే మొదలవుతుంది అనుకున్నారు అంతా.  కానీ ఇప్పుడు చూస్తే సుకుమార్ సినిమా రెండు భాగాలు కావడం, వాటి మధ్యకు ‘ఐకాన్’ వచ్చి చేరడం చూస్తే కొరటాల శివ సినిమా మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది.  ఇక బన్నీ జాబితాలో మురుగదాస్, బోయపాటి శ్రీను లాంటి స్టార్ డైరెక్టర్లు కూడ ఉన్నారు.  మరి వీరి సినిమాలు ఎప్పుడెప్పుడు ఉంటాయో చూడాలి.