చంద్ర‌బాబు డిమాండ్.. జ‌గ‌న్ ప‌ట్టించుకుంటారా..?

టీడీపీ అధినేత చంద్రబాబు మ‌రోసారి వైసీపీ స‌ర్కార్ పై విమ‌ర్శ‌లు కురిపించారు. అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళితే.. విశాఖ సాల్వెంట్ ఫ్యాక్ట‌రీ ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాస్ కుటుంబానికి కోటిరూపాయ‌లు ప‌రిహారం చెల్లించాల‌ని చంద్ర‌బాబు డిమాండ్ చేశారు. ఈ క్ర‌మంలో ఎల్జీ పాలిమ‌ర్స్ ఘ‌ట‌న‌లో బాధితుల‌కు ఎలాంటి ప‌రిహారం చెల్లించారో, సాల్వెంట్ ప‌రిశ్ర‌మ ప్ర‌మాదంలో బాదితుల‌కు కూడా అంతే చెల్లించాల‌న్నారు.

అంతే కాకుండా ఈ ప్ర‌మాదానికి కార‌ణ‌మైన సాల్వెంట్ కంపెనీ యాజ‌మాన్యం పై వెంట‌నే కేసులు న‌మోదు చేసి అరెస్ట్ చేయాల‌ని చంద్ర‌బాబు కోరారు. ఇక జ‌గ‌న్ స‌ర్కార్ పాల‌న ప‌రంగా విఫ‌ల‌మవుతూనే ఉంద‌ని, ముఖ్యంగా ప‌రిశ్ర‌మ‌ల భ‌ద్ర‌త విష‌యంలో వైసీపీ ప్ర‌భుత్వం పూర్తిగా వైఫ‌ల్యం చెందింద‌ని చంద్ర‌బాబు ఆరోపించారు. ఇక బాదితుల‌ను పరామర్శించ‌డానికి వెళ్లిన, ప్ర‌తిప‌క్ష‌ నేతలను నిర్భంధం చేయడాన్ని క‌రెక్ట్ కాద‌ని చంద్రబాబు మండి ప‌డ్డారు. మ‌రి చంద్ర‌బాదు డిమాండ్‌ను జ‌గ‌న్ ప‌ట్టించుకుంటారో లేదో చూడాలి.