ఒకే వేదిక‌పై సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైన బిగ్ బాస్4 కంటెస్టెంట్స్ .. వీడియో

బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ కార్య‌క్రమం తెలుగులో స‌క్సెస్ ఫుల్‌గా నాలుగు సీజ‌న్స్ జ‌రుపుకుంది. నాలుగో సీజ‌న్ లో అభిజీత్ విన్న‌ర్‌గా నిల‌వ‌గా, అఖిల్ ర‌న్న‌ర్‌గా నిలిచాడు. బిగ్ బాస్ షోతో మోనాల్, అఖిల్, అరియానా, అవినాష్‌, సోహెల్, మెహ‌బూబ్ , దివి వంటి కంటెస్టెంట్స్‌ల‌కు మంచి ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. బుల్లితెర కార్య‌క్ర‌మాల‌తో పాటు ప‌లు సినిమాల‌లో న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నారు. అయితే స్టార్ మా బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో మ‌రో వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టింది.

బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్ అంద‌రిని ఒక చోట చేర్చి బీబీ ఉత్స‌వం పేరుతో ప్ర‌త్యేక షో ద్వారా ప్రేక్ష‌కుల‌కు ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించేందుకు సిద్ధ‌మైంది. ఈ షోకు ప్ర‌ముఖ యాంక‌ర్ శ్రీముఖి వ్యాఖ్య‌తగా ఉండ‌నుండ‌గా, ఈ ఆదివారం సాయంత్రం 6 గంటల‌కు బీబీ ఉత్స‌వ్ స్టార్ మాలో ప్రసారం కానుంది. దానికి సంబంధించి తాజాగా ఓ ప్రోమోను విడుద‌ల చేశారు. ఇందులో బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్ అంద‌రు మాములు హ‌డావిడి చేయ‌ట్లేదు. సొహైల్ గుండె మీద అరియానా చేయి వేయ‌గా.. అత‌డు మెహ‌బూబ్‌, అఖిల్ అని పిల‌వ‌డం.. అమ్మ రాజ‌శేఖర్, అవినాష్‌ల‌తో హారిక బాక్సింగ్ ఆడ‌టం , మెహ‌బూబ్, సొహైల్, అవినాష్‌ల‌కు లాస్య బ‌ల‌వంతంగా తినిపించ‌డం ఇలాంటి స‌న్నివేశాలు అభిమానులని అల‌రిస్తున్నాయి.

గంగ‌వ్వ కూడా ఈ షోకు హాజ‌రు కాగా, ఆమె కూడా త‌న‌దైన శైలిలో సంద‌డి చేసింది. మొత్తానికి బిగ్ బాస్ సీజ‌న్ 4 కంటెస్టెంట్స్ చేసిన సంద‌డికి ప్ర‌తి ఒక్క‌రు తెగ ఫిదా అవుతున్నారు. ఆదివారం సాయంత్రం ప్ర‌సారం కానున్న ఈ షో ఎంత రేటింగ్ రాబ‌డుతుందో చూడాలి మ‌రి .