వెబ్ ఫిల్మ్ ‘ప్రేమ విమానం’ ఫస్ట్ లుక్ పోస్టర్

హైద్రాబాద్, ఏప్రిల్ 19 : గూఢచారి, రావణాసుర వంటి అద్భుతమైన సినిమాలను నిర్మించిన అభిషేక్ పిక్చర్స్ ఇప్పుడు ఓ వెబ్ ఫిల్మ్‌ను నిర్మించింది. అభిషేక్ పిక్చర్స్, జీ5 సంయుక్తంగా నిర్మిస్తోన్న ప్రేమ విమానం అనే వెబ్ ఫిల్మ్ ఫస్ట్ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. నిర్మాత అభిషేక్ నామా బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన చేశారు.

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అన్ని ప్రధాన పాత్రధారులను పరిచయం చేశారు. ఇద్దరు పిల్లలు (దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా), హీరో హీరోయిన్లు (సంగీత్ శోభన్, శాన్వీ మేఘన), వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్ ఇలా అందరూ కూడా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కనిపిస్తున్నారు.

ఎలాగైనా సరే విమానం ఎక్కాలని ప్రయత్నించే ఇద్దరు పిల్లలు, అర్జెంట్‌గా ఫ్లైట్ ఎక్కి తమ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ప్రేమ జంట ఇలా అందరినీ ఒకే చోటకు చేర్చుతుంది కథ. ఇక వీరి ప్రయాణంలో వచ్చే మలుపులు, సంతోషాలు, బాధలు, నవ్వులు ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించేలా ఉంటాయి.

ఉన్నతమైన ప్రొడక్షన్ విలువలతో తెరకెక్కిన ప్రేమ విమానం కచ్చితంగా ఫీల్ గుడ్ ఎంటర్టైనర్‌గా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుంది. ఈ వెబ్ ఫిల్మ్‌కి సంతోష్ కటా దర్శకత్వం వహించగా.. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. జగదీష్ చీకటి కెమెరామెన్‌గా పని చేశారు.

నటీనటులు : సంగీత్ శోభన్, శాన్వీ మేఘన, అనసూయ భరద్వాజ్, వెన్నెల కిషోర్, దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా తదితరులు

సాంకేతిక బృందం :

సమర్పణ : దేవాన్ష్ ; నామా నిర్మాత : అభిషేక్ పిక్చర్స్, జీ5 ; నిర్మాత : అభిషేక్ నామా; దర్శకత్వం : సంతోష్ కటా; సంగీత దర్శకుడు : అనూప్ రూబెన్స్; సినిమాటోగ్రఫర్ : జగదీష్‌ చీకటి; ఎడిటర్ : అమర్ రెడ్డి; ఆర్ట్ డైరెక్టర్ : గంధి నడికుడికర్; సీఈఓ : వాసు పోతిని; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మోహిత్ రాల్యని

జీ5 గురించి :

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలి ఇలా ఇతర భాషల్లో ఉన్న గొప్ప కంటెంట్‌ను జీ5 నిత్యం ఆడియెన్స్‌కు అందిస్తూనే ఉంది. దేశ వ్యాప్తంగా జీ5కి మంచి కంటెంట్ అందిస్తుందనే పేరు ఉందన్న సంగతి తెలిసిందే. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మీద నిర్మించిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన లూసర్ 2, బీబీసీ స్టూడియో, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన గాలివాన, రెక్కి, హలో వరల్డ్, మా నీళ్ల ట్యాంగ్, అహనా పెళ్లంట, ఏటీఎం, పులి మేక వంటి ఎన్నో మంచి వెబ్ సిరీస్‌లను జీ5 అందించింది. ప్రేమ విమానం, వ్యవస్థ అనే రెండు కొత్త ప్రాజెక్ట్‌లతో ఆడియెన్స్‌ను ఆకట్టుకోబోతోంది.