Bad Girlz: ‘బ్యాడ్ గాళ్స్’ కోసం వస్తున్న డిమాండ్ మేరకు ఇంకా షోలు పెంచుతున్నాం.. సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో దర్శక, నిర్మాతలు

Bad Girlz: ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై రేణు దేశాయ్, అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మొయిన్, రోహన్ సూర్య ముఖ్య తారాగణంతో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ చిత్ర దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి దర్శకత్వంలో వచ్చిన మరో ఎంటర్టైనర్ చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ చిత్రం క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 25న విడుదలై మంచి టాక్‌తో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో..

దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి (మున్నా) మాట్లాడుతూ .. ‘‘బ్యాడ్ గాళ్స్’ నిడివి విషయంలో చిన్నది కానీ.. కంటెంట్ విషయంలో మాత్రం చాలా పెద్దది. ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం ప్రధాన బలం. ఆ రెండు కారణాలతో మా సినిమాని అందరూ చూడొచ్చు. మా టీజర్, సాంగ్, ట్రైలర్ నచ్చితేనే థియేటర్‌కు రమ్మన్నాను. ఇప్పుడు ఆడియెన్స్ మా మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. కరోనాలో రిలీజ్ చేసిన మా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ పెద్ద హిట్ అయింది. ఇప్పుడు మా ‘బ్యాడ్ గాళ్స్’ మూవీని ఆడియెన్స్ హిట్ చేశారు. ఎంత కాంపిటీషన్‌లో వచ్చినా మనం హిట్టు కొడతామని మా నిర్మాతలు ముఖ్యంగా నమ్మారు. ఇప్పుడే అదే నిజమైంది. ప్రస్తుతం థియేటర్లు పెంచే పనుల్లో నిర్మాతలున్నారు. మా సినిమాని ఎంతో నిజాయితీగా తీశాం. ఇది అమ్మాయిల కోసం తీసిన చిత్రం. జాతి రత్నాలు మూవీని అమ్మాయిలతో తీస్తే ఎలా ఉంటుందో మా చిత్రం అలా ఉంటుంది. జాతి రత్నాలు, మ్యాడ్ చిత్రాలు మీకు నచ్చితే మా ఈ మూవీ కూడా నచ్చుతుంది. మా సినిమాకు ఇంకా ఇలానే అందరూ సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

నిర్మాత శశిధర్ నల్ల మాట్లాడుతూ .. ‘‘బ్యాడ్ గాళ్స్’ సినిమాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ప్రతీ యాక్టర్ మాకు ఎంతో అండగా నిలబడ్డారు. థియేటర్ల నుంచి నాకు ఫోన్స్ వస్తున్నాయి. ఇంకా షోలు, స్క్రీన్‌లు పెంచమని అడుగుతున్నారు. ప్రస్తుతం ఉన్న కాంపీటిషన్‌లో మా చిన్న సినిమాని అద్భుతమైన సినిమాగా మార్చారు. మా మూవీని ఆదరిస్తున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

నిర్మాత రామిశెట్టి రాంబాబు మాట్లాడుతూ .. ‘‘బ్యాడ్ గాళ్స్’ మూవీని ఎంతో కష్టపడి తీశాం. మంచి కంటెంట్‌తో చాలా మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాం. మంచి సినిమా అన్న నమ్మకంతోనే చాలా కాంపిటీషన్‌లో రిలీజ్ చేసి సక్సెస్ అయ్యాం. మా సినిమాకు సపోర్ట్‌గా నిలిచిన అనూప్ రూబెన్స్, చంద్రబోస్ గార్లకు థాంక్స్. వస్తున్న డిమాండ్ మేరకు స్క్రీన్లను, షోలను పెంచుతున్నామ’ని అన్నారు.

రోషన్ సూర్య మాట్లాడుతూ .. ‘‘బ్యాడ్ గాళ్స్’ నా సినీ ప్రయాణానికి నాందిలా అనిపిస్తోంది. దర్శకుడు కథను అద్భుతంగా నెరేట్ చేశారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్, చంద్రబోస్ లిరిక్స్ అని చెప్పారు. అప్పుడే సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను. ఇది నాకు ఆరంభం మాత్రమే. ఈ చిత్రానికి మంచి స్పందన వస్తుండటం ఆనందంగా ఉంది. మా టీంను ఇలానే ఆదరించండి’ అని అన్నారు.

పాయల్ చెంగప్ప మాట్లాడుతూ ..‘‘నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఫస్ట్ హాఫ్ యూత్ కంటెంట్‌లా ఉంటుంది. సెకండాఫ్ అంతా కూడా ఎమోషనల్‌గా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది. మా మూవీని చూసిన వారంతా కూడా కన్నీరు పెట్టేస్తున్నారు. అందరికీ ఎమోషనల్‌గా కనెక్ట్ అయింది. ఇది నాకు తొలి చిత్రం. మా సినిమాని అందరూ సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

రోషిణి మాట్లాడుతూ .. ‘రోజి రెడ్డి అనే పాత్రను నాకు ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ‘బ్యాడ్ గాళ్స్’ అనే చిత్రాన్ని ఆడియెన్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రతీ ఒక్క అమ్మాయి, ప్రతీ ఒక్క ఫ్యామిలీ చూడాల్సిన చిత్రమిది. అన్ని రకాల అంశాలు ఈ మూవీలో ఉంటాయి. ఇలాంటి చిత్రంలో పార్ట్ అయినందుకు నాకెంతో ఆనందంగా ఉంది’ అని అన్నారు.

మొయిన్ మాట్లాడుతూ .. ‘‘బ్యాడ్ గాళ్స్’ చిత్రాన్ని అన్ని వర్గాల ఆడియెన్స్ ఇష్టపడుతున్నారు. నన్ను ఈ చిత్రంలో తీసుకున్న దర్శకుడు మున్నా గారికి థాంక్స్. నాకు ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా సినిమాకు మంచి టాక్ వస్తోంది. ఈ మూవీని జనాల వద్దకు మరింతగా తీసుకెళ్లాలని మీడియాని కోరుతున్నాను’ అని అన్నారు.

అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ .. ‘‘నీలి నీలి ఆకాశం’ పాట ఎంతగా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలోని పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. చూసిన ప్రతీ ఒక్కరూ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. మంచి కంటెంట్‌తో మున్నా గారు మళ్లీ హిట్టు కొట్టారు. వస్తున్న డిమాండ్ మేరకు మళ్లీ షోలు, స్క్రీన్‌లను పెంచుతున్నారు. మాకు మీడియా ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తుందని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ఎడిటర్ బొంతల నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ .. ‘‘బ్యాడ్ గాళ్స్’ మూవీని మున్నా గారు అద్భుతంగా తీశారు. కామెడీ,ఎమోషన్స్ అన్నింటినీ చక్కగా చూపించారు. ఆర్టిస్టులు చక్కగా నటించారు. ఇది చాలా మంచి చిత్రం. అందరూ మరింతగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

తారాగణం: అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మొయిన్, రోహన్ సూర్య తదితరులు

సాంకేతిక బృందం:
దర్శకుడు: ఫణి ప్రదీప్ ధూళిపూడి
బ్యానర్స్: ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్
నిర్మాతలు: శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె ఎమ్ కుమార్
సంగీతం: అనూప్ రూబెన్స్
లిరిక్స్: ఆస్కార్ చంద్ర బోస్
సినిమాటోగ్రాఫర్: ఆర్లి గణేష్
ఎడిటర్: బొంతల నాగేశ్వరరెడ్డి

చంద్రబాబు స్కిల్ కేసు రి ఓపెన్ || Journalist Bharadwaj About Chandrababu Skill Development Case ||TR