Mechanic Rocky: విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ అక్టోబర్ 20న ట్రైలర్ విడుదల

Mechanic Rocky: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మోస్ట్ ఎవైటెడ్ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ ‘మెకానిక్ రాకీ’తో అలరించడానికి రెడీగా వున్నారు. ఈ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ఇంట్రస్టింగ్ టీజర్‌తో చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. మొదటి రెండు పాటలకు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మిస్తున్నారు.

ఈ రోజు సినిమా విడుదల తేదీకి సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. మెకానిక్ రాకీ నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది.

విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ నుంచి లవ్లీ అండ్ పెప్పీ సాంగ్ ఓ పిల్లా రిలీజ్

రిలీజ్ డేట్ పోస్టర్‌లో విశ్వక్ సేన్ ఇంటెన్స్ ఎక్స్ ప్రెషన్ తో కనిపించారు. మీనాక్షి సాంప్రదాయ చీరలో, శ్రద్ధా మోడరన్ అవుట్ ఫిట్ లో ఆకట్టుకున్నారు. మెకానిక్ రాకీ ట్రైలర్‌ను ఈ నెల 20న విడుదల చేయనున్నట్లు పోస్టర్ లో తెలియజేశారు మేకర్స్.

ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. మనోజ్ కటసాని డీవోపీ గా పనిచేస్తున్నారు. అన్వర్ అలీ ఎడిటర్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్. సత్యం రాజేష్, విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్.

తారాగణం: విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘు రామ్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి
నిర్మాత: రామ్ తాళ్లూరి
ప్రొడక్షన్ బ్యానర్: SRT ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం: జేక్స్ బిజోయ్
డీవోపీ: మనోజ్ కటసాని
ప్రొడక్షన్ డిజైనర్: క్రాంతి ప్రియం
ఎడిటర్: అన్వర్ అలీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: సత్యం రాజేష్, విద్యాసాగర్ జె
పీఆర్వో: వంశీ-శేఖర్

Analyst Dasari Vignan About NTR Arts Banner Ownership || Jr NTR || Balakrishna || Kalyan Ram || TR