‘ఆహా’ 100% తెలుగు లోకల్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్. ఇప్పటికే ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలను, ఒరిజినల్స్‌ను, టాక్ షోస్, వెబ్ సిరీస్‌లను తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ లిస్టులోకి మరో సూపర్ హిట్ మూవీ చేసింది. అదే ‘దాస్ కా ధమ్కీ’. ఈ చిత్రం ఏప్రిల్ 14 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతుంది. మల్టీ టాలెంటెడ్ విశ్వక్ సేన్ ఈ చిత్రంలో హీరోగా నటించారు. వైవిధ్యమైన కథాంశాలతో పాటు తనదైన నటనతో విశ్వక్ సేన్‌కి యూత్‌లో, ఫ్యామిలీ ఆడియెన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. హీరోగా నటిస్తూనే ఈ సినిమాను డైరెక్ట్ కూడా చేశారు. వన్మయే క్రియేషన్స్ , విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్స్‌పై విశ్వక్ సేన్, కరాటే రాజు ఈ చిత్రాన్ని నిర్మించిన దాస్ కా ధమ్కీ చిత్రానికి ఆహాలో అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆహా కంటెంట్ హెడ్ వాసు, హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ నివేదా పేతురాజ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా…
హీరో, దర్శకుడు విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘‘ఆహా వారికి థాంక్స్. దాస్ కా ధమ్కీని బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఐపీఎల్ నడుస్తున్నప్పటికీ ఆడియెన్స్ ఈ చిత్రాన్ని చక్కగా చూస్తున్నారని ఆహా టీమ్ చెప్పటం చాలా థాంక్స్. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అందరూ రిపీటెడ్‌గా చూస్తున్నారు. నెక్ట్స్ ఇయర్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాం. ఇక యాక్టర్‌గా చూస్తే గామి సినిమా చేస్తున్నాను. అలాగే డిసెంబర్ లోపు మూడు సినిమాలు చేయటానికి రెడీ అవుతున్నాను. సీక్వెల్‌లో కంటిన్యూ ఉంటుంది. సీక్వెల్ పార్ట్ వన్ కంటే పది రెట్లు ఎక్కువగా ఉంటుంది’’ అన్నారు.
కంటెంట్ హెడ్ వాసు మాట్లాడుతూ ‘‘విశ్వక్ సేన్‌తో ఇది వరకే మాకు అసోసియేషన్ ఉంది. అశోకవనంలో అర్జున కళ్యాణం ఆయనతో మేం కలిసి ప్రయాణాన్ని ప్రారంభించాం. ఆ చిత్రం గత ఏడాది ఆహాలో టాప్ త్రీ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. యు.ఎస్, యు.కెలో మంచి నెంబర్స్ వచ్చింది. తర్వాత ఓరి దేవుడా చిత్రంతో అసోసియేట్ అయ్యాం. ఆ చిత్రానికి ఆస్ట్రేలియాలో మంచి నెంబర్స్ వచ్చాయి. ఇక దాస్ కా ధమ్కీ సినిమా విషయానికి వస్తే.. విశ్వక్ కెరీర్‌లో హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమా అది. అదే సక్సెస్ ఊపును ఈ చిత్రం ఆహాలోనూ కంటిన్యూ చేస్తోంది. ఇప్పటికే 100 మిలియన్ వ్యూయింగ్ మిషన్స్ వచ్చేశాయి. మరోరెండు, మూడు రోజుల్లో 250 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్‌ను క్రాస్ చేస్తుందని భావిస్తున్నాం. ఆహాతో కలిసి విశ్వక్ ఓ సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే అనౌన్స్ చేస్తాం. ఇక రూ. 99లకే మొబైల్ ప్లానింగ్ అందుబాటులో ఉంది’’ అన్నారు.
నివేదా పేతురాజ్ మాట్లాడుతూ ‘‘థియేటర్‌లో దాస్ కా ధమ్కీ చిత్రానికి ఎంత రెస్పాన్స్ వచ్చిందో ఇప్పుడు ఆహాలొనూ అంతేలా వస్తుంది. బ్లడీ మేరీ తర్వాత ఆహా వారితో అసోసియేట్ అయిన రెండోసినిమా ఇది. వాసుగారికి థాంక్స్. ఆహా మంచి కంటెంట్‌తో ఆడియెన్స్‌ను అలరించటానికి రెడీ అవుతున్నారు. అందరికీ థాంక్స్’’ అన్నారు.