మెట్రో రెట్రో ఈవెంట్‌కు హాజరై తన ఆర్గాన్స్ ను డొనేట్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసిన విశ్వక్ సేన్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మెట్రో రెట్రో అనే నోబుల్ కాజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం నోబుల్ కాజ్ ఆర్గాన్ డొనేషన్ కు సపోర్ట్ చేయడానికి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వక్ సేన్ తన ఆర్గాన్స్ ని డొనేట్ చేస్తున్నట్లు ప్రకటించి చాలా మందికి ఆదర్శంగా నిలిచారు.

ఆర్గాన్ డొనేషన్ పై అవగాహన కల్పిస్తూ ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న విశ్వక్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొవాలని, తద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడాలని కోరారు విశ్వక్. విశ్వన్‌సేన్‌తో బ్లాక్‌బస్టర్ హిట్‌ని తీసిన దర్శకుడు శైలేష్ కొలను కూడా ఈ ఈవెంట్ కు హాజరయ్యారు.

ఫిల్మ్ ఫ్రంట్‌లో, విశ్వక్ సేన్ యూనిక్ సబ్జెక్ట్స్ ని ఎంచుకుంటున్నారు. ఇటివలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తో అలరించిన విశ్వక్, మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మెకానిక్ రాకీ’తో రాబోతున్నారు.