‘విమానం’… హృద‌యాల‌ను క‌దిలించేలా టీజ‌ర్‌

వీర‌య్య అంగ వైక్య‌లంతో ఇబ్బంది ప‌డుతున్నా కొడుకుని మాత్రం ఎంతో ప్రేమ‌గా చూసుకుంటుంటాడు. వీర‌య్య కొడుక్కి మాత్రం ‘విమానం’ అంటే పిచ్చి. విమానం ఎక్కాల‌ని ఆలోచ‌న‌ల‌తో ఎప్పుడూ త‌న చుట్టూ ఉన్న‌వారిని ప్ర‌శ్నిస్తూనే ఉంటారు. తండ్రిని కూడా విమానం ఎక్కించ‌మ‌ని బ‌తిమాలాడుకుంటూ ఉంటాడు. బాగా చ‌దువుకుంటే నువ్వే విమానం ఎక్క‌వ‌చ్చునని కొడుకుతో అంటుంటాడు వీర‌య్య‌. తండ్రీ కొడుకుల మ‌ధ్య అస‌లు ఈ విమానం గోల ఏంట‌నేది తెలుసుకోవాలంటే ‘విమానం’ సినిమా చూడాల్సిందేంటున్నారు మేక‌ర్స్‌. శ‌నివారం ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

టీజ‌ర్‌లో మాస్ట‌ర్ ధ్రువన్ కొడుకుగా న‌టిస్తే, తండ్రి పాత్ర‌లో విల‌క్ష‌ణ న‌టుడు స‌ముద్ర ఖ‌ని న‌టించారు. వీరి మ‌ధ్య సాగే విమానం సంభాష‌ణ ఆస‌క్తిక‌రంగా, ఫ‌న్నీగా ఉంది. అలాగే సినిమాలో బ‌ల‌మైన ఎమోష‌న‌ల్ అంశాలు కూడా మిళిత‌మై ఉన్నాయి. ‘నాన్నా ఎప్పుడు దేవుడు క‌న‌ప‌డినా దండం పెట్టుకోమంటావు ఎందుకు’ అని అడిగిన కొడుకుతో ‘మనం అడిగినవన్నీ ఇస్తాడు’ కాబట్టి అని తండ్రి చెబుతాడు. దానికి ఆ పిల్లాడు ‘అన్నీ ఇచ్చేవాడిని దేవుడు అనరు.. నాన్నా అంటారు’ అనే ఓ డైలాగ్ చాలు.. టీజర్‌లో తండ్రీ కొడుకుల మధ్య ఉన్న భావోద్వేగ బంధాన్ని సినిమాలో ఎలా చూపించారో చెప్పటానికి. ఈ ఎమోషనల్ జర్నీ జూన్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి (కిర‌ణ్ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్‌) ‘విమానం’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘విమానం’ చిత్రంలో వీర‌య్య అనే అంగ వైకల్యం ఉన్న తండ్రి పాత్ర‌లో స‌ముద్ర ఖ‌ని, కొడుకు పాత్రలో మాస్టర్ ధ్రువన్ న‌టిస్తుండగా సుమ‌తి పాత్ర‌లో అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, రాజేంద్ర‌న్ పాత్ర‌లో రాజేంద్ర‌న్‌, డేనియ‌ల్ పాత్ర‌లో ధ‌న్‌రాజ్‌, కోటి పాత్ర‌లో రాహుల్ రామ‌కృష్ణ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో మెప్పించబోతున్నారు.

న‌టీన‌టులు: స‌ముద్ర ఖ‌ని, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, మాస్ట‌ర్ ధ్రువ‌న్‌, మీరా జాస్మిన్, రాహుల్ రామ‌కృష్ణ‌, ధ‌న్‌రాజ్‌, రాజేంద్ర‌న్

సాంకేతిక వ‌ర్గం:

ప్రొడ్యూస‌ర్స్‌: జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి (కిర‌ణ్ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్‌)
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: శివ ప్ర‌సాద్ యానాల‌
సినిమాటోగ్ర‌పీ: వివేక్ కాలేపు
ఎడిట‌ర్‌: మార్తాండ్ కె.వెంక‌టేష్‌
మ్యూజిక్‌: చ‌ర‌ణ్ అర్జున్‌
ఆర్ట్‌: జె.జె.మూర్తి
డైలాగ్స్‌: హ‌ను రావూరి (తెలుగు), ప్ర‌భాక‌ర్ (త‌మిళం)
లిరిక్స్ : స్నేహ‌న్‌(తమిళ్), చరణ్ అర్జున్ (తెలుగు)
పి.ఆర్‌.ఒ: నాయుడు – ఫ‌ణి (బియాండ్ మీడియా) (తెలుగు), యువ‌రాజ్ (త‌మిళ్‌)
డిజిట‌ల్ ఏజెన్సీ: హ్యాష్ ట్యాగ్ మీడియా

Vimanam Official Teaser | Telugu | Samuthirakani | Anasuya | Meera Jasmine | Siva Prasad Yanala