విజువల్ ట్రీట్‌గా విజయ్ దేవరకొండ, సమంత ‘ఖుషి’ టైటిల్ సాంగ్

డాషింగ్ హీరో ది విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న పాన్ ఇండియన్ చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది. ఈ మధ్యే ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ప్రారంభించింది చిత్రయూనిట్. ఇప్పుడు మేకర్లు మ్యూజికల్ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో చేపడుతున్నారు.

తాజాగా ఖుషి థర్డ్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ఖుషి అంటూ సాగే ఈ టైటిల్ సాంగ్ ఇప్పుడు శ్రోతలను ఆకట్టుకుంటోంది. ఈ పాటకు శివ నిర్వాణ సాహిత్యం అందించారు. హిషామ్ అబ్దుల్ వాహబ్ స్వయంగా ఆలపించారు. ఇక హిషామ్ అబ్దుల్ వాహబ్ అందించిన బాణీ ఎంతో వినసొంపుగా ఉంది. ఇక ఇందులో విజువల్స్ మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ఉన్నాయి. ఈ మెలోడీ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌…