సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత సెప్టెంబర్ 1న ‘ఖుషీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానుంది. విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో హీరోగా నటించాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. ప్యూర్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా ‘ఖుషీ’ చిత్రాన్ని శివ నిర్వాణ ప్రేక్షకులకి అందిస్తున్నారు.
‘శాకుంతలం’ సినిమాతో భారీ డిజాస్టర్‌ని ఖాతాలో వేసుకున్న సమంత ‘ఖుషి’తో సక్సెస్ అందుకోవాలని భావిస్తోంది. సినిమాపైనే కూడా పాజిటివ్ వైబ్ ఉంది. ‘లైగర్’ లాంటి డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ నుంచి వస్తోన్న సినిమా ఇది కావడంతో రౌడీ స్టార్ కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు. ‘ఖుషి’తో పాటు సమంత హిందీలో ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ కూడా చేస్తోంది. వెబ్ సిరీస్ షూటింగ్ కూడా కంప్లీట్ కావడంతో ఏడాది పాటు యాక్టింగ్ కి దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకోవాలని సమంత భావిస్తోంది. మానసిక ప్రశాంతత కోసం ఇప్పటికే ఆధ్యాత్మిక ప్రదేశాలు తిరుగుతూ దైవదర్శనం చేసుకుంటుంది. అలాగే యోగా, మెడిటేషన్ పై ఫోకస్ చేస్తోంది.
మరో వైపు ఇతర దేశాలు వెళ్తూ ప్రకృతి అందాలు ఆస్వాదిస్తోంది. సినిమాలకి దూరంగా ఉన్న సోషల్ విూడియాలో మాత్రం సమంత యాక్టివ్ గానే ఉంది. తనకి సంబందించిన రెగ్యులర్ అప్డేట్ ని సోషల్ విూడియాలో పోస్ట్ చేస్తోంది. తాజాగా సమంత ఇంటరెస్టింగ్ పోస్ట్ పెట్టింది. బొద్దింకని చంపితే హీరో అంటారు. అదే సీతాకోకచిలుకని చంపితే విలన్ అంటారు. ఇక్కడ అందాన్ని బట్టి నైతికత ఆధారపడి ఉంటుంది అంటూ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
ఈ పోస్ట్ యాదృచ్ఛింకంగా పెట్టిందో లేదంటే కావాలని పెట్టిందో తెలియదు కానీ సమాజంపై సమంత తనకున్న కోపాన్ని ఈ పోస్ట్ లో స్పష్టంగా చూపిస్తుంది. నైతికత గురించి ప్రతి ఒక్కరు సమాజంలో ఎక్కువ మాట్లాడుతారు. సిచువేషన్ బట్టి నైతికత మారిపోతుంది అనే భావాన్ని తెలియజేసే విధంగా ఆమె పోస్ట్ ఉండటం విశేషం.!