విక్టరీ వెంకటేష్ # వెంకీ75 జనవరి 25న అనౌన్స్ మెంట్

‘’ఎఫ్3’’ బ్లాక్‌బస్టర్ విజయంతో దూసుకుపోతున్న విక్టరీ వెంకటేష్, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పై వెంకట్ బోయనపల్లి నిర్మించనున్న హై-బడ్జెట్ చిత్రం కోసం ‘HIT’. ఫ్రాంచైజ్ తో వరుస విజయాల్ని అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ శైలేశ్ కొల‌ను తో చేతులు కలపనున్నారు.

వెంకటేష్ ల్యాండ్‌మార్క్ 75వ చిత్రం- #వెంకీ75, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ప్రొడక్షన్ నెం 2 గా రాబోతుంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ ‘శ్యామ్ సింగరాయ్’ తో నిర్మాణంలో విజయవంతంగా అడుగుపెట్టింది. ప్రొడక్షన్ హౌస్ ఈ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని భారీ స్థాయిలో రూపొందించనుంది. వెంకటేష్‌కి ఇది అత్యంత భారీ బడ్జెట్ సినిమా కానుంది.

సక్సెస్ ఫుల్ పీపుల్ నుంచి వస్తున్న ఈ సినిమాపై సహజంగానే భారీ అంచనాలు వున్నాయి. ప్రీ లుక్ పోస్టర్‌లో వెంకటేష్ చేతిలో ఏదో పట్టుకున్న సిల్హౌట్ ఇమేజ్ కనిపిస్తుంది. అది గన్ కాదు.. మరి అదేంటో అనే విషయం ఈ నెల 25న తెలుస్తుంది. భారీ పేలుడు, దట్టమైన పొగతో కూడిన ప్రీ-లుక్ పోస్టర్ వెంకటేష్ ఇంటెన్స్ రోల్, సినిమా యాక్షన్ జానర్‌ను సూచిస్తుంది.

విన్నంగ్ స్క్రిప్ట్‌ను రాసిన శైలేశ్ కొల‌ను, వెంకటేష్ ను మునుపెన్నడూ చూడని సరికొత్త పాత్రలో ప్రజంట్ చేయనున్నారు. ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులు నటించనున్నారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేయనున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో మేకర్స్ అనౌన్స్ చేస్తారు.

తారాగణం: వెంకటేష్

సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం : శైలేష్ కొలను
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
బ్యానర్: నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్
పీఆర్వో : వంశీ-శేఖర్