రవీంద్ర భారతిలో వెంపడప్ప లక్ష్మి స్వతంత్ర ప్రవేశం నిర్వహించిన నిష్రింకల డ్యాన్స్ అకాడమీ

హైదరాబాద్, 26 జూలై 2023:- ప్రతిభావంతురాలైన కూచిపూడి నర్తకి వెంపడప్ప లక్ష్మి యొక్క అద్భుతమైన విజయాలు మరియు ప్రయాణాన్ని స్మరించుకోవడానికి సంధ్యా రాజు స్థాపించిన నిష్రింకల డ్యాన్స్ అకాడమీ. “స్వతంత్ర ప్రవేశం” శీర్షికన అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగింది.

ఈ కార్య్రమానికి గౌరవనీయులైన ముఖ్య అతిథి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత మరియు భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకురాలు డాక్టర్ సుచిత్రా ఎల్లా మరియు పద్మశ్రీ అవార్డ్ గ్రహీత మరియు ప్రఖ్యాత భరతనాట్య విద్వాంసురాలు శ్రీమతి లీలా శాంసన్ హాజరైనారు. అలాగే, ఈ కార్యక్రమానికి గౌరవ అతిధులుగా శ్రీమతి ఆర్ష విద్యా మందిర్ చైర్ మరియు రామ్‌కో సిఎస్‌ఆర్ డైరెక్టర్ నిర్మల రాజా మరియు హైదరాబాద్ యూనివర్శిటీలో కూచిపూడి ఎక్స్‌పోనెంట్ మరియు హెచ్‌ఓడి అయిన డాక్టర్ అనురాధ తడకమల్ల (జొన్నలగడ్డ), ప్రతిభావంతులైన టెలివిజన్ వ్యాఖ్యాత మరియు నటి, ప్రతిష్టాత్మక నంది అవార్డును తొమ్మిది సార్లు అందుకున్న శ్రీమతి ఝాన్సీ గారు విచ్చేశారు.

ఈ సందర్భంగా నిష్రింకాల డ్యాన్స్ అకాడమీ వ్యవస్థాపకురాలు సంధ్యారాజు మాట్లాడుతూ , కార్యక్రమానికి హాజరై తన విద్యార్థిని లక్ష్మిని ఆశీర్వదించిన ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. “నా విద్యార్థి లక్ష్మి వెంపడప్ప యొక్క ప్రదర్శనను తిలకించటానికి మీరు ఇక్కడికి రావడం నాకు ఆనందంగా వుంది. ఇది నాకు చాలా ప్రత్యేకం. మనమంతా అద్భుతమైన, అంకితభావం మరియు అభిరుచి కలిగిన కూచిపూడి నృత్యకారిణి – విష్ణు కళా డ్యాన్స్ అకాడమీ కి చెందిన నా విద్యార్థిని లక్ష్మి ప్రదర్శన కోసం ఇక్కడ వున్నాము. భారత్ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సహ వ్యవస్థాపకులు మరియు పద్మభూషణ్ డాక్టర్ సుచిత్రా ఎల్లా గారికి మరియు భరతనాట్యం ఎక్స్‌పోనెంట్, పద్మశ్రీ శ్రీమతి లీలా శాంసన్‌కి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఈ కార్యక్రమానికి హాజరైనందుకు అనురాధ జొన్నలగడ్డ గారు మరియు నటి-టెలివిజన్ వ్యాఖ్యాత ఝాన్సీ గారు మరియు ప్రియమైన అమ్మ నిర్మల రాజు గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని సంధ్యా రాజు తెలిపారు.

నిష్రింకలా డ్యాన్స్ అకాడమీ ప్రవేశపెట్టిన స్వతంత్ర ప్రవేశం అనే వినూత్నమైన వేడుక శాస్త్రీయ నృత్య ప్రపంచంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. సాంప్రదాయ రంగప్రవేశం వలె కాకుండా, కూచిపూడి ప్రపంచంలో ఆర్థికంగా స్వతంత్రంగా మరియు సృజనాత్మక కళాకారుడిగా అడుగు పెట్టడానికి మంచి అనుభవజ్ఞుడైన మరియు పరిణతి చెందిన విద్యార్థి తమ గురువు నీడ నుండి ఉద్భవించిన క్షణాన్ని ఇది జ్ఞాపకం చేస్తుంది. గురువు యొక్క ఆశీర్వాదంతో, గురువు, సహచరులు మరియు ఇన్‌స్టిట్యూట్‌తో బలమైన బంధాన్ని కొనసాగిస్తూనే ప్రదర్శనలు, నృత్యరూపకం, బోధన, ఆవిష్కరణ మరియు కళాత్మక వ్యక్తిత్వాన్ని కొనసాగించేలా విద్యార్థిని ప్రోత్సహిస్తారు.

సామాజిక వివక్షను ఎదుర్కొంటూ, ఇంటి పనివారిగా తన తల్లిదండ్రుల కష్టాలను చూస్తూ లక్ష్మి పెరిగారు. 2009లో 150 మంది దరఖాస్తుదారులలో శ్రీమతి సంధ్యా రాజు, లక్ష్మి యొక్క ప్రతిభ ప్రకాశవంతంగా ప్రకాశిస్తుందని కనుగొన్నారు. నిష్రింకలా డ్యాన్స్ అకాడమీలో లక్ష్మి స్కాలర్‌షిప్ సంపాదించింది. స్కూల్, బ్యూటీషియన్ కోర్సులు మరియు డ్యాన్స్ క్లాస్‌కి 5 కి.మీ నడక, ఆమె అచంచలమైన సంకల్పం వంటివి ఆమెను ప్రత్యేకించి, ఆమె ప్రదర్శనకారిగా ఎదగడానికి సహాయపడింది. ఈ రోజు, ఆమె నిష్రింకలలో ఫ్రీలాన్స్ డ్యాన్సర్‌గా మరియు పూర్తి సమయం ఉపాధ్యాయురాలిగా మాత్రమే కాకుండా ఆన్‌లైన్ తరగతుల ద్వారా అంతర్జాతీయ విద్యార్థులకు తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది.

లక్ష్మి యొక్క అంతర్గత సౌందర్యం ఆమె చర్యలలో ప్రతిబింబిస్తుంది. నిస్వార్థంగా తన పొరుగున ఉన్న పేద పిల్లలకు కూచిపూడి నేర్పడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారామె. ఆమె కథ నిలకడ, ఒకరి అభిరుచిని అనుసరించడం మరియు సమాజానికి తిరిగి ఇవ్వడం వంటి విలువల యొక్క శక్తివంతమైన రిమైండర్‌గా పనిచేస్తుంది. అవరోధాలను ఎదుర్కొన్నప్పటికీ, ఆమె విజేతగా నిలిచింది మరియు ఆమె స్ఫూర్తిదాయకమైన ప్రయాణం కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరి హృదయాలను తాకింది.

ఈ కార్యక్రమం లక్ష్మి సాధించిన విజయాలను మాత్రమే కాకుండా, లెజండరీ పద్మభూషణ్ డా. వెంపటి చిన సత్యం గారి సాంప్రదాయ సిలబస్, కొరియోగ్రఫీ మరియు కళాత్మక శైలిని కాపాడుతూ సమకాలీన ప్రేక్షకుల కోసం సంబంధిత ప్రదర్శనలను రూపొందించడం ద్వారా కూచిపూడి హద్దులను విస్తరించడానికి నిష్రింకాల డ్యాన్స్ అకాడమీ యొక్క ప్రయత్నం ను కూడా వేడుక చేసుకుంది. ఔత్సాహిక నృత్యకారులకు ఉచిత స్కాలర్‌షిప్‌లను అందించే అకాడమీ, లక్ష్మి వంటి యువ ప్రతిభావంతులకు శిక్షణ ఇవ్వడం మరియు ప్రోత్సహించటం ద్వారా కూచిపూడి కళలో ధ్రువ తారగా వెలగాలని లక్ష్యంగా పెట్టుకుంది.

సంధ్యా రాజు, జాతీయ అవార్డు గ్రహీత. కూచిపూడి గురించి గొప్పగా మాట్లాడిన టాలీవుడ్ సినిమా ‘ నాట్యం’ సినిమా తో ఆమె సుప్రసిద్దమయ్యారు. దేశమంతటా శాస్త్రీయ నృత్యాన్ని తీసుకువెళ్లటం తో పాటుగా మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో శాస్త్రీయ నృత్యానికి ప్రాచుర్యం తీసుకురావటం తో పాటుగా కళాకారులను ప్రోత్సహించడం మరియు వారికి స్కాలర్‌షిప్‌లను అందించటం ద్వారా మద్దతు అందించటం తన కల అని ఆమె చాలా సందర్భాలలో చెప్పారు.

About Nistrinkara Dance Academy:
Nistrinkara Dance Academy, Hyderabad was set up In 2008 by Sandhya Raju to train students in the Ancient Art Of Kuchipudi. Nishrinkala Means unbound and unshackled. The academy always push the boundaries Of Kuchipudi by creating relevant presentations for a contemporary audience while also attempting to preserve and practice the traditional syllabus, choreography and artistic style of Dr. Vempati Chinna Satyam Garu. The academy uses Modern Training Techniques to create Professional Dancers of quality and finesse. Nishrinkala Dance Academy aims to be a school of excellence in the art of Kuchipudi

For more information Please contact :
Shiva Chittla | +91 9849282502

Nishrinkala Dance Academy (Sandhya Raju) presents