వరుణ్ తేజ్ ‘మట్కా’, 35 రోజుల లాంగ్ షెడ్యూల్ కోసం RFCలో 15 కోట్లతో వింటేజ్ వైజాగ్ సెట్‌లు నిర్మాణం

వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మట్కా’ ప్రస్తుతం మూడో షెడ్యూల్ జరుపుకుంటోంది. ఇది 35 రోజుల లాంగ్ షూటింగ్ షెడ్యూల్, ఈ ఒక్క ఫేజ్ కే 15 కోట్ల మ్యాసీవ్ బడ్జెట్‌ను కేటాయించారు. ప్రొడక్షన్ టీం వింటేజ్ వైజాగ్ లోకేషన్స్ ని రామోజీ ఫిల్మ్ సిటీ (RFC)లో మ్యాసీవ్ సెట్‌లలో రిక్రియేట్ చేస్తోంది. ప్రేక్షకులకు అథెంటిసిటీ, గ్రాండియర్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించే లక్ష్యంతో టీం వర్క్ చేస్తోంది.

‘మట్కా’ హై బడ్జెట్‌ పాన్-ఇండియా చిత్రంగా రూపొందుతోంది. వింటేజ్ సెట్లలో ఇన్వెస్ట్మెంట్ విజువల్ వండర్ ని అందిస్తోంది. వైజాగ్‌లోని ఎసెన్స్ ని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ సెట్‌లు సినిమా హైలైట్‌లలో ఒకటిగా నిలుస్తాయి. మేకింగ్ వీడియో ఇంటెన్సీవ్ ప్రీ-ప్రొడక్షన్, గ్రాండ్-స్కేల్ మేకింగ్‌ను ప్రజెంట్ చేసింది. ఇందులో వరుణ్ తేజ్ గ్లింప్స్ కూడా చూపించారు.

వెర్సటైల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకునే వరుణ్ తేజ్ ‘మట్కా’లో మరో మరపురాని పాత్రకు జీవం పోయనున్నారు. ఈ చిత్రంలో అతని పాత్ర దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించబోతోంది.

దేశాన్ని కదిలించిన యదార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు కరుణ కుమార్ మ్యాసీవ్ స్క్రిప్ట్‌ను రూపొందించారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటి నోరా ఫతేహి కీలక పాత్రలో కనిపించనుంది.

హ్యుజ్ బడ్జెట్‌తో నిర్మించిన సెట్స్‌తో పాటు యూనిక్ కాన్సెప్ట్‌తో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులను అద్భుతంగా అలరిస్తుందని ‘మట్కా’ మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. వారి లక్ష్యం కేవలం ఎంటర్ టైన్మెంట్ మాత్రమే కాదు, ఇండియన్ సినిమా చరిత్రలో నిలిచిపోయే సినిమాటిక్ అనుభూతిని క్రియేట్ చేయడం.

టాప్ క్లాస్ నిర్మాణ విలువలు, వింటేజ్ వైజాగ్ రిక్రియేషన్ హైలైట్‌లుగా ఉంటూ వరుణ్ తేజ్ కెరీర్‌లో ‘మట్కా’ ఒక మైల్ స్టోన్ మూవీ కాబోతోంది.

నటీనటులు: వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులు

సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కరుణ కుమార్
నిర్మాతలు: డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి
బ్యానర్లు: వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డీవోపీ: A కిషోర్ కుమార్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
సీఈఓ: ఈవీవీ సతీష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్కే జానా, ప్రశాంత్ మండవ, సాగర్
కాస్ట్యూమ్స్: కిలారి లక్ష్మి
పీఅర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా