Matka: వరుణ్ తేజ్ ‘మట్కా’ టీజర్ అక్టోబర్ 5న విజయవాడలోని రాజ్ యువరాజ్ థియేటర్‌లో లాంచ్

Matka Movie Teaser: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హైలీ యాంటిసిపేటెడ్ పీరియడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మట్కా‘. కరుణ కుమార్ దర్శకత్వంలో వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన సెకండ్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది

మేకర్స్ ఈ సినిమా టీజర్‌కు సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చారు. మట్కా పవర్ ప్యాక్డ్ టీజర్ అక్టోబర్ 5న విడుదల కానుంది. టీజర్ లాంచ్ ఈవెంట్ విజయవాడ ఓల్డ్ థియేటర్ రాజ్ యువరాజ్ లో జరగనుంది.

వరుణ్ తేజ్ కెరీర్ లో హయ్యస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందుతున్న ‘మట్కా’లో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు ఎ.కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫర్. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్.

Matka: వరుణ్ తేజ్ ‘మట్కా’ నవంబర్ 14న థియేట్రికల్ రిలీజ్- సెకండ్ లుక్ విడుదల

షూటింగ్ చివరి దశలో ఉన్న మట్కా నవంబర్ 14న విడుదల కానుంది.

తారాగణం: వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులు

సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కరుణ కుమార్
నిర్మాతలు: డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి
బ్యానర్లు: వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డీవోపీ: ఎ కిషోర్ కుమార్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
సీఈఓ: ఈవీవీ సతీష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్కే జానా, ప్రశాంత్ మండవ, సాగర్
కాస్ట్యూమ్స్: కిలారి లక్ష్మి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

Ka Paul Fires On Konda Surekha Over Samantha & Naga Chaitanya Issue | Nagarjuna | Revanth Reddy | TR