వరుణ్ తేజ్, మట్కా-హైదరాబాద్‌లో జరుతున్న ఫైనల్ షెడ్యూల్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘మట్కా’ (Matka Movie) షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా షెడ్యూల్ హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలో జరుగుతోంది. కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తవుతుంది.

కరుణ కుమార్ దర్శకత్వంలో వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి మూవీని మ్యాసీవ్ స్కేల్ లో నిర్మిస్తున్నారు.

పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో వరుణ్ తేజ్ (Varun Tej) డిఫరెంట్ మేకోవర్‌లలో కనిపించనున్నారు. ఇటివలే విడుదలైన వరుణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాఫీగా సాగుతున్నాయి. మేకర్స్ అనౌన్స్ చేసినట్లుగా చాలా ఎక్సయిటింగ్ అప్‌డేట్‌లతో రాబోతున్నాయి.

ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఎ కిషోర్ కుమార్ డీవోపీ పని చేస్తుండగా, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్.

తారాగణం: వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, సలోని, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులు

సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కరుణ కుమార్
నిర్మాతలు: డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి
బ్యానర్లు: వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డీవోపీ: ఎ కిషోర్ కుమార్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
ప్రొడక్షన్ డిజైనర్: కిరణ్ కుమార్ మన్నె
సీఈఓ: ఈవీవీ సతీష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్కే జానా, ప్రశాంత్ మండవ, సాగర్
కాస్ట్యూమ్స్: కిలారి లక్ష్మి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా