Thank You Dear: హెబ్బా పటేల్, రేఖ నిరోషా, ధనుష్ రఘుముద్రి నటించిన “థాంక్యూ డియర్” చిత్ర ట్రైలర్ విడుదల

మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై పప్పు బాలాజీ రెడ్డి నిర్మాతగా తోట శ్రీకాంత్ రచన దర్శకత్వంలో ఆగస్టు 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం థాంక్యూ డియర్. ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోషా ముఖ్యపాత్రలు పోషించగా వీర శంకర్ నాగ మహేష్ రవి ప్రకాష్ చత్రపతి శేఖర్ బలగం సుజాత సంక్రాంతి శ్రీనివాస్ నాయుడు తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రానికి పి.ఎల్.కె రెడ్డి డిఓపిగా పని చేయగా సుభాష్ ఆనంద్ సంగీతాన్ని అందించారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి ఒక పాటను రాకింగ్ స్టార్ మంచు మనోజ్ లాంచ్ చేయగా చిత్ర టీజర్ ను సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ లాంచ్ చేశారు. చిత్ర విడుదల తేదీ దగ్గర పడుతున్న సందర్భంగా నేడు థాంక్యూ డియర్ చిత్ర బృందం ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది.

Thank You Dear Movie Trailer 4K | Hebah Patel | Dhanush Raghumudri | Rekha Nirosha | TeluguFilmNagar

ఇక ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే ఒక ప్రేమికుడు కనిపిస్తున్నాడు. అయితే అప్పటికే రేఖ నిరోషాతో పెళ్లయిన ధనుష్ రఘుముద్రి ట్రైలర్ చూస్తుంటే హెబ్బా పటేల్తో ప్రేమలో పడినట్లు తెలుస్తుంది. వారి ఇద్దరి మధ్య ధనుష్ ఎలా మేనేజ్ చేశాడు ట్రైలర్లో చూస్తుంటే ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తుంది. ట్రైలర్ లోని డైలాగులు అటు హాస్యంగా అలాగే ఇటు ట్రెండ్ కు తగ్గట్లు ఉన్నాయి. అదేవిధంగా సినిమాలో ఎన్నో మలుపులతో కూడిన సస్పెన్షన్ ఉన్నట్లు అర్థమవుతుంది.

ట్రైలర్ లోని బిజిఎం సినిమాకు ప్లస్ అవ్వడానికి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ట్రైలర్ విజువల్స్ వస్తుంటే నిర్మాణ విలువలు అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఎన్నో ప్రేమ కథలు అలాగే సస్పెన్స్త్రులను చూసి అలవాటు పడిన ప్రేక్షకులకు ఈ ట్రైలర్ చూస్తుంటే మరొక కొత్త కథను ప్రేక్షకులు అనుభూతి చెందుతారని అర్థమవుతుంది. ఇక ఈ థాంక్యూ డియర్ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఆగస్టు 1వ తేదీన వెండితెరపై చూడాల్సిందే.

నటి నటులు – హెబా పటేల్ , ధనుష్ రఘుముద్రి , రేఖ నిరోషా, వీర శంకర్ , నాగ మహేష్ , రవి ప్రకాష్ , ఛత్రపతి శేఖర్ , బలగం సుజాత , సంక్రాంతి ఫేమ్ శ్రీనివాస్ నాయుడు తదితరులు.

బ్యానర్ : మహా లక్ష్మి ప్రొడక్షన్స్
ప్రొడ్యూసర్ : పప్పు బాలాజీ రెడ్డి
రైటర్ & డైరెక్టర్ – తోట శ్రీకాంత్ కుమార్
ఎడిటర్ : రాఘవేంద్ర పెబ్బేటి
మ్యూజిక్ – సుభాష్ ఆనంద్
డి ఓ పి : పి ఎల్ కె రెడ్డి
లైన్ ప్రొడ్యూసర్ – బలిజ పునీత్ రాయల్
కో ప్రొడ్యూసర్ – పి బి వి వి సత్య నారాయణ
కాస్ట్యూమ్ డిజినర్ – భావన పోలిపల్లి
పి ఆర్ ఓ – మధు వి ఆర్
డిజిటల్ – డిజిటల్ దుకాణం

మిథున్ రెడ్డికి తోడుగా జగన్|| Ys Jagan Lawyer Niranjan Reddy Fires On Mithun Reddy Arrest Case || TR