నరేష్ అగస్త్య, బ్రహ్మాజీ, హర్ష చెముడు, సుదర్శన్, మౌర్య సిద్ధవరం, కౌశిక్ ఘంటశాల రియా సుమన్, ప్రియాంక శర్మ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తోన్న చిత్రం ‘#మెన్ టూ’. లాన్‌థ్రెన్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై శ్రీకాంత్ జి.రెడ్డి దర్శకత్వంలో మౌర్య సిద్ధవరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 26న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. కొన్నాళ్లు ముందు విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్ అందరిలో ఆసక్తిని పెంచింది.
తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్‌ను యంగ్ హీరోస్ విశ్వక్ సేన్, సందీప్ కిషన్ విడుదల చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ‘#మెన్ టూ’ అనేది మన ఇండియా పెద్ద ఎత్తున జరిగిన సామాజిక ఉద్యమం. ఇది మీ టూ ఉద్యమంలో తప్పుడు లైంగిక ఆరోపణలకు వ్యతిరేకంగా ప్రారంభించబడ్డ ఉద్యమం.
ట్రైలర్ విషయానికి వస్తే.. ఫెమినిజమ్ కొటేషన్‌తో స్టార్ట్ అయ్యింది. స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం అనే పాయింట్ మీద డిస్కషన్ జరగటాన్ని చూపించారు. ఆడవాళ్లు లేని చోటనే మగవాళ్లు హ్యాపీగా ఉంటారనే విషయాన్ని బ్రహ్మాజీ వివరించారు. మగవాళ్లు తమ జీవితాల్లో ఆడవారి వల్ల పడే బాధలను ఎంటర్‌టైనింగ్ యాంగిల్‌లో వివరించే ప్రయత్నం చేశారు. ఇలాంటి సమస్యలను మగవాళ్లు ఎలా హ్యండిల్ చేస్తారనే దాన్ని కూడా చూపించారు. హిలేరియల్ ఎంటర్‌టైనర్‌గా ‘#మెన్ టూ’ సినిమా ఉంటుందని స్పష్టమవుతుంది. డైలాగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలుస్తున్నాయి. హక్కులు స్త్రీలకే కాదు.. పురుషులకు ఉంటుందని తెలియజేసే సినిమా అని తెలుస్తుంది. కామెడీ, లవ్, ఎమోషన్స్ ఇలా అన్నీ అంశాల కలయికగా ‘#మెన్ టూ’ మూవీని రూపొందించారు. యూత్‌ను టార్గెట్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారని తెలుస్తుంది. మే 26న సినిమా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.
నటీనటులు: నరేష్ అగస్త్య, బ్రహ్మాజీ, హర్ష చెముడు, సుదర్శన్, మౌర్య సిద్ధవరం, కౌశిక్ ఘంటశాల రియా సుమన్, ప్రియాంక శర్మ తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్: లాన్‌థ్రెన్ క్రియేటివ్ వర్క్స్
నిర్మాత: మౌర్య సిద్ధవరం
కో ప్రొడ్యూసర్: శ్రీమంత్ పాటూరి
దర్శకత్వం: శ్రీకాంత్ జి.రెడ్డి
మ్యూజిక్: ఎలిషా ప్రవీణ్, ఓషో వెంకట్
సినిమాటోగ్రఫీ: పి.సి.మౌళి
ఎడిటర్: కార్తీక్ ఉన్నవ
పాటలు, మాటలు: రాకేందు మౌళి
ఆర్ట్: చంద్రమౌళి.ఇ
కో డైరెక్టర్: సుధీర్ కుమార్ కుర్రు
పి.ఆర్.ఓ: వంశీ కాకా