‘హాయ్ నాన్న’లో గొప్ప మ్యాజిక్ వుంది: నేచురల్ స్టార్ నాని

నేచురల్ స్టార్ నాని సినిమాల్లో సాధారణంగా చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లు ఉంటాయి. అదేవిధంగా, శౌర్యువ్ దర్శకత్వం వహించిన నాని పాన్ ఇండియా చిత్రం ‘హాయ్ నాన్నా’ కూడా డిఫరెంట్ జోనర్ సాంగ్స్ ఆల్బమ్‌ తో అలరిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలోని మొదటి రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా బిట్స్ ఫిలాని క్యాంపస్ లో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో ఈ సినిమా మూడో సింగిల్ ‘అమ్మాడి’ పాటని లాంచ్ చేశారు.

మృణాల్ ఠాకూర్ తన థర్డ్ యానివర్సరీని రివీల్ చేస్తూ తన పెర్ ఫార్మెన్స్ తో పాట ప్రారంభమవుతుంది. “ఇది నా భర్తకు అంకితం చేస్తున్న చాలా ప్రత్యేకమైన పాట. అతను ఎప్పటిలాగే ఆలస్యంగా వస్తున్నారు. పాట నా మాతృభాష తెలుగులో ఉంది’’ అంటూ మృణాల్ వాయిస్ తో పాట మొదలౌతుంది. ఈ పాట నాని, మృణాల్‌ల స్వీట్, బ్యూటీఫుల్ ప్రేమకథను చూపిస్తూ పెద్ద వేడుకను సెలబ్రేట్ చేస్తోంది. ఈ సోల్ ఫుల్ మెలోడీ.. వారి పెళ్లి రోజు నుండి, వివాహ ప్రారంభ రోజులలో వారు కలసివున్న అద్భుతమైన రోజుల వరకు, ప్రేమ యొక్క కొత్త అధ్యాయాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది. ఈ పాటలో నాని, మృణాల్ డిలైట్ ఫుల్ కెమిస్ట్రీ మెస్మరైజ్ చేస్తోంది. హేషామ్ అబ్దుల్ వహాబ్ ఇన్స్టెంట్ గా కనెక్ట్ అయ్యే మరొక ప్లజెంట్ నంబర్‌ను అందించారు. మొదటి రెండు పాటల్లాగే ఇది కూడా ఆల్బమ్‌లో మరో బ్లాక్‌బస్టర్ సాంగ్ అవుతుంది. కృష్ణకాంత్ ఆకట్టుకునే, మీనింగ్ ఫుల్ లిరిక్స్ అందించారు. కాల భైరవ, శక్తిశ్రీ గోపాలన్ వోలక్స్ ఎక్స్ ప్రెషివ్ గా వున్నాయి.

సాంగ్ లాంచ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. ఈ ఆడిటోరియం నాకు చాలా స్పెషల్. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సమయంలో ఇక్కడికి వచ్చాను. వరుసగా ఎనిమిది సూపర్ హిట్లు నాన్ స్టాప్ గా కొట్టాను. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఈసారి పదహారు సూపర్ హిట్లు కొట్టకుండా బ్రేక్ తీసుకుంటే కరెక్ట్ కాదని ఫిక్స్ అయిపోయా. ఇక్కడ నుంచి మా ప్రమోషనల్ కాంపెయిన్ స్టార్ట్ కావడం చాలా ఆనందంగా వుంది. హాయ్ నాన్నలో మీకు కావాల్సినంత ప్రేమ దొరుకుతుంది. థియేటర్ కి వెళ్లి మంచి ప్రేమకథ చూసి చాలా రోజులైయింది. ఇందులో మీకు టన్నులకొద్ది ప్రేమ దొరుకుతుంది. హాయ్ నాన్నలో గొప్ప మ్యాజిక్ వుంది. అది మీ అందరికీ నచ్చుతుంది. సీతారామం తర్వాత మృణాల్ ని అందరూ సీత అంటున్నారు. దీనికి మించిన పాత్ర హాయ్ నాన్నలో తను చేసిందని మా నమ్మకం. డిసెంబర్ 7తర్వాత తన పేరు యష్నా గా మారిపోతుంది. హాయ్ నాన్న 7న విడుదలౌతుంది. అందరూ థియేటర్స్ లో చూడండి. హాయ్ నాన్న తప్పకుండా మీ అందరినీ గొప్పగా అలరిస్తుంది’ అన్నారు

మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. సీతారామంతో మీ అందరూ నాపై ఎంతో ప్రేమ చూపించారు. హాయ్ నాన్నలో అమ్మాడి పాట చాలా స్పెషల్. హేషమ్ అబ్దుల్ స్వరపరిన పాటలు అంటే నాకు చాలా ఇష్టం. ఇందులో కూడా అద్భుతమైన పాటలు వున్నాయి. అమ్మాడి పాట మీ అందరితో పంచుకోవడం అనందంగా వుంది. హాయ్ నాన్న చాలా స్పెషల్ మూవీ. నాని గారు నేచురల్ స్టార్. ఆయనతో కలసి వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. సీతారామంతో సీతలానే ఇందులో యష్నా పాత్ర కూడా మనసుని హత్తుకుంటుంది. అందరూ తప్పకుండా సినిమా చూడాలి. మీ అందరికీ సినిమా నచ్చుతుంది” అన్నారు

దర్శకుడు శౌర్యువ్ మాట్లాడుతూ.. హాయ్ నాన్న పాటలు మీ అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. డిసెంబర్ 7న సినిమా విడుదలౌతుంది. తప్పకుండా అందరూ సినిమా చూడాలి. హాయ్ నాన్న అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది” అన్నారు

సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ మాట్లాడుతూ.. హాయ్ నాన్నలో భాగం కావడం ఆనందంగా వుంది. చాలా ప్రేమతో నిజాయితీగా తీసిన సినిమా ఇది. పాటలకు గొప్ప ఆదరణ లభించింది. సినిమాని అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.

వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ స్థాయిలో నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీలో బేబీ కియారా ఖన్నా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.

ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా సాను జాన్ వరుగీస్ ఐఎస్‌సి, ఎడిటర్‌గా ప్రవీణ్ ఆంథోని, ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా గా పని చేస్తున్నారు. సతీష్ ఈవీవీ ఎగ్జిక్యూటివ్ నిర్మాత.

‘హాయ్ నాన్నా’ డిసెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

తారాగణం: నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఖన్నా

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: శౌర్యువ్
నిర్మాతలు: మోహన్ చెరుకూరి (CVM) డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల
బ్యానర్: వైర ఎంటర్‌టైన్‌మెంట్స్
డీవోపీ: సాను జాన్ వరుగుస్ ISC
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎడిటర్: ప్రవీణ్ ఆంటోని
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – సతీష్ ఈవీవీ
కాస్ట్యూమ్ డిజైనర్: శీతల్ శర్మ
పీఆర్వో: వంశీ-శేఖర్