వెరీ ట్యాలెంటెడ్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో యంగ్ హీరో రోషన్ కనకాల తన తొలి చిత్రం ‘బబుల్‌గమ్’ ప్రమోషనల్ మెటిరయల్ తన నటనా నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకున్నాడు. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా, మేకర్స్ మూడవ సింగిల్ జాను పాటని విడుదల చేశారు.
శ్రీచరణ్ పాకాల చాలా స్టైలిష్‌గా ఉండే మనసుని హత్తుకొని మెలోడీని కంపోజ్ చేశారు. అనంత శ్రీరామ్ సాహిత్యం ప్రేమకథలోని బాధను, హీరో హార్ట్ బ్రేక్ ఎమోషన్ ని అద్భుతంగా వర్ణిస్తుంది. లిరిక్స్ లో చాల డెప్త్ వుంది. పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా వుంది.
ఈ అందమైన మాంటేజ్ నంబర్ ని జావేద్ అలీ పాడారు. పాటలో చక్కని ఎక్స్‌ప్రెషన్స్‌తో రోషన్ కనకాల మరోసారి ఆకట్టుకున్నాడు. మానస చౌదరి అతని ప్రేయసిగా నిపించింది. పాటలాగా విజువల్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి.
శ్రీచరణ్ పాకాల డిఫరెంట్ ట్రాక్‌లతో ఆల్బమ్‌ని స్కోర్ చేశాడు. మొదటి పాట పెప్పీ నంబర్ అయితే, రెండవ పాట సెల్ఫ్ రెస్పెక్ట్ ర్యాప్. మూడో పాట మనసుని హత్తుకునే మెలోడీ.
గరుడవేగ, తెల్లవారితే గురువారం, ఆకాశవాణి చిత్రాలకు పనిచేసిన సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్ కాగా, ‘తల్లుమల’ ఫేమ్ కేరళ స్టేట్ అవార్డ్ విన్నర్ నిషాద్ యూసుఫ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది.
తారాగణం: రోషన్ కనకాల, మానస చౌదరి, హర్ష చెముడు, కిరణ్ మచ్చ, అనన్య ఆకుల, హర్షవర్ధన్, అను హాసన్, చైతు జొన్నలగడ్డ, బిందు చంద్రమౌళి తదితరులు.
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: రవికాంత్ పేరేపు
కథ: రవికాంత్ పేరెపు, విష్ణు కొండూరు, సెరి-గన్ని
బ్యానర్లు: మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం: శ్రీచరణ్ పాకాల
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సురేష్ రగుతు
ఆర్ట్ డైరెక్టర్: విఠల్ కొసనం
ప్రొడక్షన్ డిజైన్: శివమ్ రావు
స్క్రీన్ ప్లే కన్సల్టెంట్: వంశీ కృష్ణ
క్రియేటివ్ ప్రొడ్యూసర్: దివ్య విజయ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మధులిక సంచన లంక
పబ్లిసిటీ డిజైన్: అనంత్ కంచెర్ల
పీఆర్వో: వంశీ-శేఖర్