ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘కిల్లర్ కిల్లర్’ పాట విడుదల

నేషనల్ అవార్డ్ విన్నర్, సూపర్ స్టార్ ధనుష్ మోస్ట్ అవైటెడ్ పీరియడ్ ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయ్యింది.

తాజాగా ‘కెప్టెన్ మిల్లర్’ ఫస్ట్ సింగిల్ కిల్లర్ కిల్లర్ పాటని విడుదల చేసిన మేకర్స్ గ్రాండ్ గా మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. స్టార్ కంపోజర్ జివి ప్రకాష్ ఈ పాట కోసం పవర్ ప్యాక్డ్ నెంబర్ ని స్కోర్ చేశారు. రాకేందుమౌళి రాసిన లిరిక్స్ పవర్ ఫుల్ గా వున్నాయి. సింగర్ హేమచంద్రతో కలసి హీరో ధనుష్ స్వయంగా ఈ పాటని హై ఎనర్జీ వోకల్స్ తో ఆలపించారు. ఈ పాటలో చూపించిన విజువల్స్ ఎక్స్ ట్రార్డినరీ గా వున్నాయి. హీరో క్యారెక్టర్ ని వైల్డ్ అండ్ ఇంటెన్స్ గా ప్రజెంట్ చేసిన ఈ పాట ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా అలరించింది.

1930-40 బ్యాక్ డ్రాఫ్ లో హ్యుజ్ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతోంది. డాక్టర్ శివ రాజ్ కుమార్, సందీప్ కిషన్ పవర్ ఫుల్ రోల్స్ లో నటిస్తున్న ఈ పీరియడ్ ఫిల్మ్ లో ప్రియాంకా అరుళ్‌ మోహన్ కథానాయిగా నటిస్తోంది. టి.జి. త్యాగరాజన్ సత్యజ్యోతి ఫిల్మ్స్, సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. జి. శరవణన్, సాయి సిద్ధార్థ్‌ సహా నిర్మాతలు.

ఈ చిత్రం ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. సిద్ధార్థ నుని డీవోపీ గా పని చేస్తున్నారు. బాహుబలి ఫ్రాంచైజీ, RRR, పుష్ప వంటి చిత్రాలకు పనిచేసిన మధన్ కార్కీ ఈ చిత్రం తమిళ వెర్షన్‌కు డైలాగ్స్ అందిస్తున్నారు. నాగూరన్ ఎడిటర్.

‘కెప్టెన్ మిల్లర్’ ‘2024 సంక్రాంతికి తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

తారాగణం: ధనుష్, ప్రియాంక మోహన్, సందీప్ కిషన్, డాక్టర్ శివ రాజ్ కుమార్

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: అరుణ్ మాథేశ్వరన్
నిర్మాతలు: జి. శరవణన్, సాయి సిద్ధార్థ్
సమర్పణ: T.G. త్యాగరాజన్
బ్యానర్: సత్యజ్యోతి ఫిల్మ్స్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డీవోపీ: సిద్ధార్థ నుని
ఎడిటింగ్: నాగూరన్
ఆర్ట్: టి.రామలింగం
పీఆర్వో: వంశీ-శేఖర్