రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ ఎక్సప్లోజివ్ టీజర్ లాంచ్

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ పై అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. షోరీల్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది, మొదటి రెండు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. రిలీజ్ డేట్ సమీపిస్తున్న కొద్దీ మేకర్స్ ప్రమోషన్స్ లో దూకుడు పెంచారు. ఈరోజు టీజర్‌ను లాంచ్ చేశారు.

80, 90s లో TDK 120 నిమిషాల క్యాసెట్‌ల నాస్టాల్జిక్ ని గుర్తు చేస్తూ టీజర్ ప్రారంభమవుతుంది. రవితేజ భాగ్యశ్రీ బోర్స్‌ల స్వీట్ అండ్ డిలైట్ ఫుల్ రొమాంటిక్ సీక్వెన్స్‌ మెస్మరైజ్ చేస్తుంది. తర్వాత టీజర్ రవితేజ ఫోకస్ చేస్తూ, అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ తన టీంతో, పవర్ ఫుల్ వ్యక్తిపై రైడ్ కి లీడర్షిప్ వహించే ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా అద్భుతంగా ప్రజెంట్ చేసింది.

పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ నాస్టాల్జిక్ చార్మ్ గా మలిచారు. క్యారెక్టర్స్, రొమాంటిక్ మూమెంట్స్, హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లు, ప్రతి ఎలిమెంట్ కంప్లీట్ ఎంటర్ టైన్మెంట్ ని ప్రామిస్ చేస్తోంది.

రవితేజ యూత్ ఫుల్ ఎనర్జీ, చార్మ్ తో స్క్రీన్ పై అద్భుతమైన మార్క్ వేశారు. భాగ్యశ్రీ బోర్స్ సంప్రదాయ దుస్తుల్లో అలరించింది, లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ టీజర్ ఫస్ట్ హాఫ్ లో కీలకంగా నిలిచింది. తరువాతి పార్ట్ రవితేజ, జగపతి బాబుల మధ్య జరిగిన ఘర్షణను ప్రజెంట్ చేసింది. జగపతి బాబు పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. వైవా హర్ష, నెల్లూరు సుదర్శన్‌ పాత్రలు హ్యుమర్ కి హింట్ ఇస్తున్నాయి.

అయనంక బోస్ సినిమాటోగ్రఫీ పిరియడ్ సెట్టింగ్ ఎసెన్స్ ని అద్భుతంగా చూపించాయి. మిక్కీ J మేయర్ మెస్మరైజింగ్ స్కోర్ మ్యజికల్ లేయర్ ని యాడ్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉంటూ అద్భుతమైన అనుభూతిని అందించాయి.

రోమాన్స్, యాక్షన్ , ఎంటర్ టైన్మెంట్ బ్లెండ్ తో మిస్టర్ బచ్చన్ మెమరబుల్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ నిఅందించడానికి సిద్ధంగా ఉన్నారని టీజర్ సూచిస్తుంది. బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ సినిమా ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్‌. టిజి విశ్వ ప్రసాద్ గ్రాండ్‌గా నిర్మించిన ‘మిస్టర్ బచ్చన్’ ఆగస్ట్ 15న విడుదల కానుంది.

టీజర్ లాంచ్ సందర్భంగా జరిగిన Q &A ప్రెస్ మీట్ లో మిస్టర్ బచ్చన్ టీం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

హరీష్ గారు.. మీరు చేసే రీమేక్స్ లో చాలా మంచి మార్పులు చేస్తారు.. ఇందులో ఎలాంటి యాడ్ ఆన్స్ వుంటాయి ?

– 80, 90s మధ్య జరిగేకథ ఇది. కొంచెం పొయిటిక్ గా చెప్పాలంటే ల్యాండ్ లైన్స్, క్యాసెట్ రికార్డింగ్ సెంటర్లు, చేతక్ స్కూటర్లు, కుమార్ షాను పాటలు ఇవన్నీ కలిపితే మిస్టర్ బచ్చన్. ఫస్ట్ హాఫ్ లో చాలా నోస్టాలజిక్ మూమెంట్స్ వుంటాయి.

హరీష్ గారు.. మీ డైలాగ్స్ మీ యాటిట్యూడ్ కి రిలేట్ అయ్యేలా వుంటాయి కదా .. ఇలా ముందే అనుకుంటారా ?

– ఎవ్వరైనా పొద్దున్న లేచి అద్దం చూసుకొని ‘నేను హీరో’ అనే బయలుదేరుతారు కదా (నవ్వుతూ)

హరీష్ గారు ఇందులో గెస్ట్ అప్పీరెన్స్ చేశారా ? ఇందులో రవితేజ గారిని అమితాబ్ ఫ్యాన్ గా ఎలా చూపించబోతున్నారు?

-చేశాను. అది పోస్టర్ వరకే పరిమితం(నవ్వుతూ)
– ఇందులో బచ్చన్ గారిని భెస్ చేసుకొని చాలా మంచి ఐటమ్స్ వున్నాయి. అవి స్క్రీన్ మీద చూస్తే బావుటుంది.

హరీష్ గారు.. మిరపకాయ్ లో రవితేజ గారిని చాలా అద్భుతంగా చూపించారు. మిస్టర్ బచ్చన్ దానికంటే అద్భుతంగా ఉంటుందా?

-నిన్న చేసిన సినిమా కంటే ఈ రోజు చేసిన సినిమా బెటర్ గా వుండాలని ఎవరైనా కోరుకుంటాం. అప్పటికి ఇప్పటికి నాకు చాలా ఎక్స్ పీరియన్స్ వచ్చింది. ఈ సినిమా టేకింగ్ పరంగా, విజువల్, మ్యూజిక్, హీరో క్యారెక్టరైజేషన్ పరంగా మిరపకాయ్ కంటే మిస్టర్ బచ్చన్ హండ్రెడ్ టైమ్స్ బెటర్ గా వుంటుంది.

– నా కెరీర్ ఫాస్టెస్ట్ సినిమా ఇది. దీనికి కారణం మా నిర్మాత విశ్వప్రసాద్ గారు. 78 రోజుల షూటింగ్ లో ఏ రోజు ఇబ్బంది పడలేదు. మేము అడిగినదాని కంటే ఎక్కువ ఇచ్చారు.

మిస్టర్ బచ్చన్ టైటిల్ పెట్టడానికి కారణం మీరు, రవితేజ గారు అమితాబ్ ఫ్యాన్ కావడమేనా ?

– చాలా మందికి ఫ్యాన్స్ గా వుంటాం, అన్ని పేర్లుపెట్టలేం కదా. కథపరంగా చిన్న పిట్టకథ వుంటుంది, అందుకు ఈ టైటిల్ పెట్టాం. ఈ టైటిల్ పెట్టింది కూడా రవితేజ గారే.

హరీష్ గారు.. రవితేజ మీ కాంబినేషన్ అంటే అంచనాలు వుంటాయి ? ఆ అంచనాలని మిస్టర్ బచ్చన్ అందుకునేలా ఉంటుందా ?

– ఆ అంచనాలుని అందుకోవడానికి చాలా కష్టపడ్డాం. సినిమా చూసిన తర్వాత ఆ అంచనాలని దాటేసాం అని మీరే అంటారు. ఎంటర్ టైన్మెంట్ చాలా ఎక్కువ వుంటుంది.

విశ్వప్రసాద్ గారు.. ఆగస్ట్ 15కి రావడం ఎలా అనిపిస్తుంది ?

– ఐదు రోజుల హాలీడేస్ కి రెండు పెద్ద సినిమాలు వస్తున్నాయి. మరో తమిళ్ సినిమా, చిన్న సినిమా కూడా వస్తున్నాయి. మన థియేటర్ సిస్టం ఈ అన్నీ సినిమాలని సపోర్ట్ చేయగలదు.

విశ్వప్రసాద్ గారు… కంటిన్యూ గా సినిమాలు చేయాలనే ఇంట్రస్ట్ మీకు ఎలా వస్తుంది ?

-మేము బిజినెస్ స్టార్ట్ చేసిందే ఫ్యాక్టరీ మోడల్ కాన్సెప్ట్ తోనే. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అన్నీ బ్యాలెన్స్ చేస్తున్నాం.

భాగ్యశ్రీ బోర్సే గారు వెల్ కం టు టాలీవుడ్ .. తెలుగు సినిమా పరిశ్రమ ఎలా అనిపించింది ?

– తెలుగు సినిమా చాలా నచ్చింది. ఇక్కడ ప్రజలు వెల్కమింగ్ గా, గౌరవంగా వుంటారు. ఇది నాకు హోంలానే అనిపిస్తుంది.

హరీష్ శంకర్ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?

– నా కెరీర్ లో హరీష్ గారికి స్పెషల్ ప్లేస్ వుంటుంది. ఆయన నా ఫస్ట్ తెలుగు మూవీ డైరెక్టర్. నాపై చాలా నమ్మకం ఉంచారు. ఆయనకి ధన్యవాదాలు.

అయనంక బోస్ గారు.. హరీష్ శంకర్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?

-మేము బ్రదర్స్ లా వుంటాం. మా మధ్య అమెజింగ్ రిలేషన్షిప్ వుంది. తనతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్.

నటీనటులు: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు, సచిన్ ఖేడేకర్, వైవా హర్ష, నెల్లూరు సుదర్శన్, తదితరులు

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: హరీష్ శంకర్
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సమర్పణ: పనోరమా స్టూడియోస్ & T-సిరీస్
సంగీతం: మిక్కీ జె మేయర్
డీవోపీ: అయనంక బోస్
ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి
ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
మేకప్ చీఫ్: ఐ శ్రీనివాసరాజు