వారసుడు 14న తెలుగులో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది

దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ల ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వారసుడు/వారిసు. విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయిక నటించిన ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జనవరి 11న తమిళ్ లో విడుదలైన వారిసు అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించిన అక్కడ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. జనవరి 14న వారసుడు తెలుగులో గ్రాండ్ గా విడుదల కాబోతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. నా జీవితంలో కుటుంబానికి చాలా ప్రాధన్యత వుంటుంది. ఎన్ని కష్టాల్లో కూడా మనతో తోడు వుండేది మన కుటుంబమే. ప్రతి కుటుంబాల్లో లోపాలు వుంటాయి. కానీ ఉన్నది ఒకటే కుటుంబం’. ఈ ఆలోచనతోనే వారసుడు కథ పై వర్క్ చేశాం. విజయ్ గారి కథ చెబితే ఒకే ఒక సిట్టింగ్ లో ఓకే అయిపోయిన కథ ఇది. అయితే విజయ్ గారితో ఈ సినిమా చేస్తున్నామన్న తర్వాత టెన్షన్ మొదలైయింది. ఆయన ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్. ఆయనకి సరిపడే విధంగా ఈ సినిమా చేయడం కోసం మంచి టీం వర్క్ చేశాం. వారిసు సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. సినిమా చూసి అందరూ నిలబడి క్లాప్స్ కొడుతున్నారు . ఒక మంచి కథని చెబితే ప్రేక్షకులు ఎంత గొప్పగా ఆదరిస్తారో వారసుడు మరోసారి నిరూపించింది. సినిమాని ప్రేమించడానికి ఈ సినిమా చూడండి.

ఈ సినిమాకి ఉండాల్సిన ప్రత్యేకత ఈ సినిమాకి వుంది. శరత్ కుమార్ , జయసుధ గారి నటన గురించి అద్భుతంగా రాస్తున్నారు. అమ్మ నిజం, నాన్న నమ్మకం అదే ఈ సినిమాలో చూస్తారు. సినిమా అంతా అయిపోయిన తర్వాత ఆడిటోరియం మొత్తం లేచి మావైపు చూస్తూ చప్పట్లు కొట్టారు. అరవింద్ గారు ఫోన్ చేసి ‘’వెయ్యి కోట్లు పెట్టిన రాని అనుభూతి ఇది’’ అని అభినందించారు. 14వ తేదిన అదే రెస్పాన్స్ తెలుగు ప్రేక్షకుల నుండి వస్తుంది. ఎందుకంటె ఇది ఒక తెలుగు గుండె తీసిన సినిమా. దిల్ రాజు గారికి కృతజ్ఞతలు. నేను ఏది అడిగిన కాదనకుండా ఇచ్చి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తారు. శ్రీకాంత్ గారు, ప్రకాష్ రాజ్, శ్యామ్ .. నటీనటులు అంతా అద్భుతంగా చేశారు. రష్మిక చాలా బ్యూటీఫుల్ గా చేసింది. వారసుడు ఒక పండగ లాంటి సినిమా. సినిమా చూసి థియేటర్ నుండి బయటికి వస్తున్నపుడు అమ్మనాన్నలకు ఒక కాల్ చేయాలని అనిపిస్తుంది. సంక్రాంతి కి వారసుడు సంక్రాంతి సెలబ్రేట్ అవుతుందని నమ్మకం వుంది’’ అన్నారు

దిల్ రాజు మాట్లడుతూ.. మీడియా ప్రతినిధుల కోసం వారిసు స్పెషల్ షోని జనవరి 10న వేశాం. నిజానికి ఇది రిస్క్. కానీ సినిమాపై మాకు నమ్మకం వుంది. సినిమా బావుందనే నమ్మకం వున్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. మీడియా, ఫ్యామిలీ షో కి అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. క్లైమాక్స్ పుర్తవగానే వంశీని హాగ్ చేసుకున్నా. ప్రేక్షకులు అంతా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. తర్వాత 11 ఉదయం ఆడియన్స్ షో వెళ్లాం. ఆడియన్స్ అంతా నిలుచుని క్లాప్స్ కొట్టారు. ప్రేక్షకుల వచ్చిన ఆదరణతో మేము పడ్డ కష్టాలు మర్చిపోయాం. ఈ సినిమా కోసం వంశీ, తమన్ డే అండ్ నైట్ కష్టపడ్డారు. ప్రేక్షకుల చూపిన రెస్పాన్స్ కి తమన్ వంశీ ఏడ్చారు. బొమ్మరిల్లు సినిమాని శాంతి థియేటర్ లో చూస్తున్నపుడు ఒక ఫోన్ కాల్ వస్తే నేను ఏడ్చా. మళ్ళీ ఇన్నాళ్ళుకు వారిసు చూస్తున్నపుడు కన్నీళ్లు వచ్చాయి. ఇది అనుకున్నది నిజం అవ్వడం వలన వచ్చే ఆనందం. సినిమాతో కనెక్ట్ అయితే ప్రేక్షకుల వచ్చే ఆదరణ.

వారసుడు టీం అందరికీ కృతజ్ఞతలు. ఎక్కడ రాజీ పడకుండా సినిమా చేసే దర్శకుడు వంశీపైడిపల్లి. తమన్ ఈ సినిమా కోసం పడిన కష్టాన్ని చూడలేకపోయాను. అంత హార్డ్ వర్క్ చేశారు. వంశీ ప్రతి సినిమాని కొత్తగా చెప్పాలనే తపన వున్న దర్శకుడు. ఈ సినిమా కోసం దాదపు ఏడాదిన్నర ప్రయాణించాం. ఈ రోజు వారిసు ఇంత పెద్ద విజయం సాధించడానికి కారణం వంశీ పైడిపల్లి హార్డ్ వర్క్. నేను జీవితాంతం గుర్తుపెట్టుకునే సినిమా చేశాడు వంశీ. తనకి మరిన్ని విజయాలు రావాలి. సుమన్, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, శ్రీకాంత్, ప్రభు, ఎస్ జే సూర్య, .. విజయ్.. మొత్తం ఎనిమిది మంది హీరోలని పెట్టుకొని అందరి దగ్గర నుండి అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ లు రాబట్టుకున్నాడు వంశీ. సినిమాని అందరూ కనెక్ట్ చేసుకున్నారు. జయసుధ గారు, శరత్ కుమార్ గారు మదర్ అండ్ ఫాదర్ గా అద్భుతంగా నటించారు. విజయ్ గారు తమిళ సూపర్ స్టార్. ఈ రోజు మీ దిల్ రాజు, మీ వంశీ తమిళ్ లో కి వెళ్లి ఒక బ్లాక్ బస్టర్ కొట్టి వచ్చారు.

చాలా గర్వంగా వుంది. ఆర్ఆర్ఆర్ సినిమాని మనవాళ్ళు ప్రపంచానికి గర్వంగా చూపించారు. ఈ రోజు మేమిద్దరం వెళ్లి తమిళ నాడులో ఒక సూపర్ హిట్ కొట్టి మీ ముందుకు వచ్చాం. ఇది గ్రేట్ ఫీలింగ్. సీతమ్మ వాకిట్లో, ఎఫ్ 2, శతమానం భవతి .. ఇలా ప్రతి సంక్రాంతి ఒక మంచి ఫ్యామిలీ సినిమా ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం. జనవరి 14న ఈ సంక్రాంతికి ‘వారసుడు’ గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు కూడా పెద్ద హిట్ చేస్తారు. సంక్రాంతికి ప్రేక్షకులు ఒక ఫ్యామిలీతో వెళ్లి మంచి సినిమాని చూడాలని అనుకుంటున్నారు. అలంటి మంచి ఫ్యామిలీ సినిమానే వారసుడు. తమిళనాట పెద్ద విజయం సాధించింది. ఆల్రెడీ ప్రూవ్ అయిన సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. మరో పెద్ద హిట్ మాకు ఇవ్వబోతున్నామనే నమ్మకంతో వున్నాం. సంక్రాంతికి వస్తున్న బాలకృష్ణ గారి సినిమాకి మంచి టాక్ తో ముందుకు వెళుతుంది. చిరంజీవి గారి వాల్తేరు వీరయ్య కూడా మంచి సక్సెస్ కావాలి. 14న వస్తున్న మా సినిమా వారసుడు కూడా పెద్ద సక్సెస్ కావాలి అన్ని సినిమాలు బావుండాలి. అన్ని సినిమాలకి డబ్బులు రావాలి’’ అన్నారు.

తమన్ మాట్లాడుతూ.. చాలా బిగ్ కాన్వాస్ లో చేసిన సినిమా ఇది. జయసుధ గారిలో మా అమ్మని చూశాను. అందుకే అమ్మ పాట అంత ఈజీగా రావడం జరిగింది. ఆ పాట చేస్తున్నపుడు ఎన్ని సార్లో ఏడ్చానో నాకే తెలీదు. జయసుధ గారి బిగ్ థాంక్స్. శరత్ కుమార్ గారి సీన్లు చూస్తున్నపుడు చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. దర్శకుడు వంశీ చాలా కమిట్ మెంట్ వున్న దర్శకుడు. అలాంటి వారు అరుదుగా వుంటారు. తనలో చాలా క్లారిటీ వుంటుంది. వంశీ హార్డ్ వర్క్ వలనే 2023 లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాం. దిల్ రాజు గారు సినిమా అంటే ప్యాషన్ వున్న నిర్మాత. అనుకున్న సబ్జెక్ట్ జనాలకు చేరాలనే తపనతో అని చేస్తారు. కార్తిక్ ఫళని అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. విజయ్ గారు బిగ్గెస్ట్ స్టార్ అఫ్ ఇండియా. థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తున్నపుడు నిజంగా ఈ సినిమా మేమే చేశామా అన్నట్లుగా అనిపించింది. ఈ సినిమా క్లైమాక్స్ చూసి ఇంట్లో నీరు ఆగలేదు. నా కుటుంబంతో కనెక్ట్ అయిపోయాను. వంశీ ఇంత బలంగా తీయడం వలనే సినిమా ఇంత కనెక్ట్ అయ్యింది. నెక్స్ట్ వారం ఈ సినిమా కలెక్షన్స్ ఏ స్థాయిలో ఉంటాయో నా మనసుకి తెలుసు. దిల్ రాజు గారి బ్యానర్ కి ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్. ఈ అవకాశం ఇచ్చిన వంశీ, దిల్ రాజు గారికి థాంక్స్’’ తెలిపారు

శరత్ కుమార్ మాట్లాడుతూ.. వారసుడు టీంతో కలసి పని చేయడం గొప్ప అనుభవం. విజయ్ గారితో పని చేయడం ఇదే తొలిసారి. దిల్ రాజు గారు గట్స్ వున్న నిర్మాత. ఈ సినిమాపై ఆయనకి గొప్ప నమ్మకం వుంది. ఆ నమ్మకం నిజమైయింది. సినిమా తమిళనాట పెద్ద విజయాన్ని సాధించింది. వంశీపైడి పల్లి నిజాయితీ గల దర్శకుడు. ఆయనతో పని చేయడం గొప్ప అనుభూతి. తమన్ మ్యూజిక్ చాలా చక్కని సంగీతం ఇచ్చారు. జయసుధ గారు వండర్ ఫుల్ యాక్టర్. అందరం ఒక కుటుంబంలా పని చేశాం. వారిసు చాలా పెద్ద హిట్. సినిమా ఎమోషనల్ గా అందరినీ టచ్ చేసింది. అందరూ చూడాల్సిన సినిమా ఇది. 14న అందరూ థియేటర్ కి వెళ్లి వారసుడు ని చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.

జయసుధ మాట్లాడుతూ.. వారిసు తమిళ్ లో పెద్ద విజయాన్ని సాధించింది. 2023 ఆరంభంలో ఇంత పెద్ద సక్సెస్ రావడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాం. ఫ్యామిలీ డ్రామాలో హార్డ్ వర్క్ ఏమిటని అనుకోవచ్చు. సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. దిల్ రాజు గారు నిర్మించిన సినిమాల్లో చాలా మంచి పాత్రలు చేశాను. నా సెకెండ్ ఇన్నింగ్ కెరీర్ ని ఆయనికే డెడికేట్ చేశాను.(నవ్వుతూ) ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం తో పని చేశాం. ఈ రోజు ఆ నమ్మకం నిజమైయింది. వంశీ పైడి పల్లి అద్భుతమైన దర్శకుడు. ఆయనతో పని చేయడం ఎప్పుడూ కొత్తగా వుంటుంది. వంశీ ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆయన హార్డ్ వర్క్ కి తగిన రిజల్ట్ వచ్చింది. తమన్ మ్యూజిక్ ఈ సినిమాకి సోల్. తన మ్యూజిక్ కి చాలా మంచి పేరొచ్చింది. శరత్ కుమార్ గారితో వర్క్ చేయడం ఆనందంగా వుంది. శ్యామ్, శ్రీకాంత్ .. అందరం ఒక ఫ్యామిలీలా పని చేశాం. విజయ్ సినిమాలో చేయడం ఇదే తొలిసారి. చాలా అద్భుతమైన వ్యక్తి. సినిమా గొప్ప విజయాన్ని సాధించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. తెలుగులో కూడా సినిమా ఘన విజయం సాధిస్తుంది’’ అన్నారు.

శ్రీకాంత్ మాట్లాడుతూ.. దర్శకుడు వంశీ పైడిపల్లికి, తమిళ ఇండస్ట్రీలో సినిమా నిర్మించి అక్కడ సూపర్ హిట్ కొట్టిన నిర్మాత దిల్ రాజు గారికి కంగ్రాట్స్. నేను తొలిసారి తమిళ్ లో చేసిన ఈ సినిమా సూపర్ హిట్ కావడం ఆనందంగా వుంది. వారసుడు హార్ట్ టచింగ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. వంశీ అద్భుతంగా ఈ సినిమాని తీశారు. తమన్ వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. విజయ్ కి తెలుగు వారంటే చాలా గౌరవం. చాలా మంచి వ్యక్తి. శరత్ కుమార్ గారు, జయసుద గారు అద్భుతంగా నటించారు. ఇంతమంచి టీంతో పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. వారసుడు 14న సంక్రాంతి కానుకగా తెలుగు విడుదలౌతుంది. తమిళ్ లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలుగు లో కూడా అంతకంటే పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను.

శ్యామ్ మాట్లాడుతూ.. వారిసు తమిళ్ లో పెద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. తెలుగులో కూడా ఖచ్చితంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. వారసుడు కంటెంట్ యునివర్సల్. ప్రపంచంలో అందరికీ కనెక్ట్ అవుతుంది. దిల్ రాజు గారు దిల్ వున్న నిర్మాతే కాదు గట్స్ వున్న నిర్మాత. బడ్జెట్ ని లెక్క చేయకుండా సినిమాని ఒక ప్యాషన్ తో తీస్తారు. వంశీ గారు నిజాయితీ గల మనిషి. అందుకే ఆయన తెరపై అంత ఎమోషన్ ని చూపించగలుగుతున్నారు. తమిళ ప్రేక్షకులు ఈ సినిమా వంశీ గారికి అభిమానులుగా మారారు. విజయ్ గారిని నుండి చాలా నేర్చుకున్నాను. వారిసుకి తమన్ మ్యూజిక్ సోల్. థియేటర్ లో మగాళ్ళు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. జనవరి 14న వారసుడు చిత్రాన్ని థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయండి

హరి మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం రెండేళ్ళు కష్టపడ్డాం. ఫ్యాన్స్ తో కూర్చుని చెన్నైలో సినిమా చూస్తున్నపుడు ఆ కష్టాన్ని మర్చిపోయాం. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో కూడా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు

డైలాగ్ రైటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. దిల్ రాజు గారి బ్యానర్ లో పని చేయాలని అందరికీ వుంటుంది. వారసుడు ఆ అవకాశం వంశీ గారి రూపంలో వచ్చింది. వంశీ గారు చాలా పర్టికులర్ గా వుంటారు. ప్రతిది దగ్గర వుండి రాయిస్తారు, ఇందులో నేను రాసింది కాదు ఆయనే రాయించారు. వంశీ గారికి స్పెషల్ థాంక్స్.

*వారసుడు సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేసిన సునీల్ బాబు ఐదు రోజుల క్రితం గుండెపోటు తో కన్నుమూశారు. ఈ ప్రెస్ మీట్ లో వారసుడు టీమ్ సునీల్ బాబుకు సంతాపం తెలిపింది.