ఆగష్టు 12 న దుబాయ్ లో టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ !!

రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వ సహాయ స‌హ‌కారంతో ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌’. ఆధ్వ‌ర్యంలో 13 మంది జ్యూరీ సభ్యుల సమక్షంలో `టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023` వేడుక‌లు ఆగస్టు 12 న దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే 13 మంది జ్యూరీ సభ్యులను సెలెక్ట్ చేసుకొన్న సందర్బంగా పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బి. గోపాల్, మురళీ మొహన్, సుమన్, శివాజీ రాజా, రేలంగి నరసింహారావు, రోజా రమణి, జర్నలిస్ట్ ప్రభు తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొని ఆగస్టు 12 న దుబాయ్‌లోజరిగే టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ విజయవంతం కావాలని అన్నారు.ఈ సందర్బంగా

టియ‌ఫ్ సీసీ చేర్మెన్ డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. 2021, 22 సంవ‌త్స‌రంలో విడుద‌లైన చిత్రాల వాళ్లు టీఎఫ్‌సీసీ వెబ్ సైట్ లో అప్ల‌య్ చేసుకోవ‌చ్చు. కాబట్టి చివరి తేదీ జూన్ 15.ప్ర‌ముఖుల‌తో ఏర్పాటు అయిన క‌మిటీ మెంబ‌ర్స్ చిత్రాల‌ను చూసి అర్హులు అనుకున్న వారికి అవార్డ్స్ ప్ర‌క‌టిస్తాం.తెలంగాణ ప్రభుత్వం నుండి నంది అవార్డ్స్ కు సంబందించిన లెటర్ పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు సంతకం చేసి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం కూడా స్పాన్సర్ కూడా చేస్తామన్నారు.అలాగే ఆంధ్ర ప్రభుత్వాన్ని కూడా ఆడగపోతున్నాం. త్వరలో వారి సహకారం కూడా తీసుకోబోతున్నాము.ఆగస్టు 12 న ఈ అవార్డ్స్ దుబాయ్ ప్రిన్స్ చేతుల మీదుగా నంది అవార్డులు ఇవ్వ‌నున్నాం. ఈ నంది అవార్డ్స్ కు గెస్ట్ లుగా టూరిజం మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్, సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇండస్ట్రియల్ చైర్మన్ బాల మల్లు, యఫ్. డి. సి. చైర్మన్ అనిల్ కుర్మాచలం,మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ గారు ఏపీ నుండి సినిమాటోగ్రఫీ మినిస్టర్ గోపాలకృష్ణ, హోసింగ్ మినిస్టర్ జోగి రమేష్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు,అలాగే కేరళ సి. యం ను కూడా ఆహ్వానించడం. జరిగింది. కర్ణాటక ఏం ఎల్ ఏ మధు బంగారప్ప, కన్నడ, తమిళ్, మలయాళం నుండి నలుగురు, నలుగురు హీరోలు వస్తుండగా తెలుగు నుండి చాలా మంది హీరోలు వస్తున్నారు.తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ తదితరులు గెస్ట్ గా వస్తున్నారు. వీరందరి సహకారంతోనే గత 6 సంవత్సరాల తర్వాత మొదటిసారి టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023` వేడుకలు చేయబోతున్నాము.దీనికి జ్యూరి మెంబర్స్ అందరూ పూర్తి సహకారం అందించడం జరిగింది వారందరికీ నా ధన్యవాదాలు అన్నారు.

ప్రముఖ దర్శకులు బి.గోపాల్ మాట్లాడుతూ..గ‌త కొన్నేళ్లుగా ఆగిపోయిన నంది అవార్డ్స్ ని ఇవ్వాలనే చాలా మంచి ఆలోచనతో చేస్తున్న రామకృష్ణ గారికి మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని అన్నారు

మురళి మోహన్ గారు మాట్లాడుతూ.. నంది అవార్డు అనేది ప్రతిష్టాత్మకమైన అవార్డు. గ‌త కొన్నేళ్లుగా ఆగిపోయిన నంది అవార్డ్స్ ని మ‌ళ్లీ ప్ర‌తాని రామ‌కృష్ణ గారు రెండు ప్ర‌భుత్వాల స‌హ‌కారంతో చేయడం చాలా సంతోషం. నన్ను చైర్మన్ ఉండమన్నారు కానీ నేను జ్యూరీ మెంబర్ గా ఉంటూ సపోర్ట్ చేస్తాను. తెలంగాణ ప్రభుత్వం సహకారం తీసుకున్నట్టే ఆంధ్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకోవాలని ఆన్నారు.

నటుడు సుమన్ మాట్లాడుతూ.. నంది అవార్డు అంటే ఆది ఒక ప్రిస్టేజ్.గతంలో నాకు నంది అవార్డు వచ్చింది.గతంలో తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు రామకృష్ణ గౌడ్ కూడా ముందుకు వచ్చి చేస్తున్న ఈ నంది అవార్డు ఫంక్షన్ ను సక్సెస్ చేస్తాడనే నమ్మకం ఉందని అన్నారు.

రోజా రమణి మాట్లాడుతూ.. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి పెద్ద వారి పేరు మీద స్మారక అవార్డు ఇవ్వడం చాలా గ్రేట్. ఎవరికీ రాని మంచి ఆలోచన తనకు రావడం చాలా గొప్ప విషయం ఇలా మంచి పని చేస్తున్న తనకు నా అభినందనలు అన్నారు.

జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ.. చాలా రోజుల తరువాత ఇలాంటి మంచి వేడుక చేయడం చాలా సంతోషంగా ఉంది. మీడియా సపోర్ట్ కూడా తనకు ఉంటుందని అన్నారు.

శివాజీ రాజా మాట్లాడుతూ.. సీనియర్ నటులను గౌరవిస్తూ వారి పేరు మీద స్మారక అవార్డు ఇవ్వడం చాలా గొప్ప విషయం.నంది అవార్డ్స్ తో పాటు ఇలాంటి మంచి పని చేస్తున్న రామకృష్ణ గౌడ్ గారికి గారికి మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని అన్నారు

తెలుగు ఫిలించాంబ‌ర్ సెక్ర‌ట‌రీ ప్ర‌స‌న్న కుమార్ మాట్లాడుతూ… “కొన్నేళ్లుగా నంది అవార్డ్స్ ఇవ్వ‌డం లేదు. ఇలాంటి క్ర‌మంలో ప్ర‌తాని గారు ముందుకొచ్చి క‌ళాకారుల‌ను పోత్స‌హించ‌డానికి మ‌ళ్లీ టియ‌ఫ్ సిసీ నంది అవార్డ్స్ ఇవ్వ‌డం అభినందించాల్సిన విష‌యం. అవార్డ్స్ అనేవి ఎప్పుడూ మ‌న‌లో ఉత్సాహాన్ని నింపుతాయి. ఇలాంటి మంచి ఆలోచనతో చేస్తున్న రామకృష్ణ గారికి మా పూర్తి సహకారం తనకు అందిస్తామని అన్నారు

మిస్ ఏసియా రష్మీ ఠాగూర్ మాట్లాడుతూ.. ఏడు సంవత్సరాల తర్వాత చాలా గ్రాండ్ గా దుబాయ్ లో జరుగుతున్న మా ఈవెంట్ కి ఇండస్ట్రీ నుండి అందరి సపోర్ట్ ఉండడం చాలా సంతోషంగా ఉంది.ఇలాంటి ఈవెంట్ లో నేను భాగమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

నంది అవార్డు కమిట్ సభ్యులు.

1.శ్రీ మూరళీ మోహన్ గారు,
2.సుమన్
3.T..ప్రసన్న కుమార్
4.యస్. వి. కృష్ణారెడ్డి
5.రోజా రమణి
6.శివాజీరాజా
7.బి. గోపాల్
8.విజయేంద్ర ప్రసాద్
9.మాదాల రవి
10.మిట్టపల్లి సురేంద్ర
11.రేలంగి నరసింహారావు
12.MV రాధాకృష్ణ
13.సెంథిల్
14.జర్నలిస్ట్ ప్రభు
15.శేఖర్ మాష్టార్
తదితరులు

జ్యూరి సభ్యులు సెలెక్ట్ చేసిన వారికి ఈ వేడుకల్లో
గోల్డ్,
సిల్వర్,
బ్రోంజ్,
కాపర్
అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది .

అవార్డ్ కేటగిరీలు

బెస్ట్ ఫీచర్ ఫిలిం
ఉత్తమ నటుడు
ఉత్తమ నటి
ఉత్తమ విలన్
ఉత్తమ దర్శకుడు
ఉత్తమ డి ఓ పి
ఉత్తమ సంగీత దర్శకుడు
బెస్ట్ డ్యాన్స్ దర్శకుడు
బెస్ట్ రైటర్

ప్రత్యేక అవార్డులు

ఎన్టీఆర్ స్మారక అవార్డు
ANR స్మారక అవార్డు
సూపర్ స్టార్ కృష్ణ స్మారక అవార్డు
రెబల్ స్టార్ కృష్ణం రాజు స్మారక అవార్డు
అల్లు రామలింగయ్య స్మారక అవార్డు
దర్శక రత్న దాసరి నారాయణరావు స్మారక అవార్డు
కాంతారావు స్మారక అవార్డు

డెబ్యూ అవార్డులు

ఉత్తమ నూతన దర్శకుడు
బెస్ట్ డెబ్యూ యాక్టర్ మేల్
బెస్ట్ డెబ్యూట్ యాక్టర్ ఫిమేల్
బెస్ట్ డెబ్యూ విలన్
బెస్ట్ డెబ్యూ మ్యూజిక్ డైరెక్టర్

ఇతర అవార్డులు

టీవీ యాంకర్లు, మేల్ & ఫిమేల్
న్యూస్ & ఎంటర్టైన్మెంట్ 10- అవార్డులు
ఫిల్మ్ జర్నలిస్టుల అవార్డులు