నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ గ్లోబల్ యాక్షనర్ ‘ది ప్యారడైజ్’ మూవీ ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుండి ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. దసరా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ‘ది ప్యారడైజ్’ ప్రతిష్టాత్మక స్థాయిలో రూపొందుతోంది. ‘రా స్టేట్‌మెంట్’ గ్లింప్స్ విడుదలైన తర్వాత మూవీ చుట్టూ బజ్ మరింత స్ట్రాంగ్ అయ్యింది. ఇప్పుడు, మేకర్స్ వెరీ ట్యాలెంటెడ్ రాఘవ్ జుయల్‌ను సినిమా కోసం ఎంపిక చేసుకున్నారు. మేకర్స్ స్ట్రైకింగ్ BTS వీడియోతో అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
వీడియోలో శ్రీకాంత్ ఓదెల, రాఘవ్ క్యారెక్టర్ ని, బ్రూటల్ నేచర్ ని వివరిస్తున్నారు. సినిమాలో అతని పాత్ర గురించి తెలుసుకోవడానికి నటుడు ఉత్సాహంగా ఉన్నట్లు వీడియోలో కనిపిస్తుంది.
రాఘవ్ జుయల్ ప్రత్యేకమైన ప్రతిభ కలిగిన యాక్టర్. కిల్, గ్యారా గ్యారా వంటి చిత్రాలలో అద్భుతమైన నటనను ప్రదర్శించిన అతను ఇప్పుడు ‘ది ప్యారడైజ్’లో నేచురల్ స్టార్ నానితో కలిసి మరో మెమరబుల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.
షారుఖ్ ఖాన్‌తో కలిసి ‘కింగ్’ సినిమాలో తన పాత్రపై ఊహాగానాలు నడుస్తుండగానే, ఇప్పుడు రాఘవ నాని శ్రీకాంత్ ఓదెల పాన్-ఇండియా ప్రాజెక్ట్‌తో మరో గొప్ప అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు.
రాఘవ్ జుయల్ 2026లో మేజర్ పాన్-ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ది ప్యారడైజ్ మార్చి 26, 2026న విడుదల కానుంది.
మరిన్ని ఎక్సయిటింగ్ అప్‌డేట్స్ ని మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు.
తారాగణం: నాని, రాఘవ్ జుయల్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: SLV సినిమాస్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
DOP: CH సాయి
ఎడిటింగ్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఆడియో: సరిగమ మ్యూజిక్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో



