గోపీచంద్ ‘భీమా’- పోస్టర్‌తో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన టీమ్

మాచో స్టార్ గోపీచంద్‌ హీరోగా తెరకెక్కుతున్న యూనిక్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భీమా’ నిర్మాణ దశలో ఉంది. ఈ చిత్రాన్ని ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ హర్ష దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ ఇంటెన్స్ పోస్టర్‌ను విడుదల చేశారు.

గోపీచంద్ ఖాకీ దుస్తుల్లో ఫెరోషియస్ గా కనిపించారు. సినిమాలో పవర్ ఫుల్ పోలీసు పాత్ర పోషిస్తున్న గోపీచంద్ పోస్టర్ లో చేతిలో సంకెళ్ళు పట్టుకొని టెర్రిఫిక్ గా కనిపించారు. ఈ పోస్టర్ సినిమాలో గోపీచంద్ వైల్డ్ నేచర్ ని తెలియజేస్తోంది.

హై స్టాండర్డ్ టెక్నికల్, ప్రొడక్షన్ వాల్యూస్‌తో భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

స్వామి జె గౌడ సినిమాటోగ్రాఫర్ కాగా, సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. రమణ వంక ప్రొడక్షన్ డిజైన్, తమ్మిరాజు ఎడిటర్. కిరణ్ ఆన్‌లైన్ ఎడిటర్ కాగా, అజ్జు మహంకాళి డైలాగ్స్ అందిస్తున్నారు. రామ్-లక్ష్మణ్, వెంకట్, డాక్టర్ రవివర్మ ఫైట్స్ ని కొరియోగ్రఫీ చేస్తున్నారు

తారాగణం: గోపీచంద్, ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: ఎ హర్ష
నిర్మాత: కేకే రాధామోహన్
బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
డీవోపీ: స్వామి జె గౌడ
సంగీతం: రవి బస్రూర్
ప్రొడక్షన్ డిజైనర్: రమణ వంక
ఎడిటర్: తమ్మిరాజు
ఆన్‌లైన్ ఎడిటర్: కిరణ్
డైలాగ్స్: అజ్జు మహంకాళి
ఫైట్స్: రామ్-లక్ష్మణ్, వెంక, డాక్టర్ రవివర్మ
పీఆర్వో: వంశీ-శేఖర్