Phoenix: సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ‘ఫీనిక్స్’ జూలై 4న రిలీజ్

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ఫీనిక్స్. ఏకే బ్రేవ్‌మ్యాన్ పిక్చర్స్ ఈ సినిమాని సమర్పిస్తోంది. జూలై 4, 2025న ఈ చిత్రం గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది.

ప్రముఖ స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, యాక్షన్‌తో పాటు భావోద్వేగాలను మిళితం చేస్తూ, కొత్త హీరోకి సరైన లాంచింగ్ మూవీగా వుండబోతోంది.

ఈ సినిమాకి సామ్ సిఎస్ సంగీతాన్ని అందిస్తుండగా, వెల్‌రాజ్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ కెఎల్ ఎడిటర్. టెక్నికల్ క్రూ బలంగా ఉండటంతో, ఫీనిక్స్‌పై అంచనాలు పెరిగాయి.

ఇది సూర్య సేతుపతి పూర్తి స్థాయిలో హీరోగా నటిస్తున్న తొలి చిత్రం కాగా, గతంలో నానుమ్ రౌడీ ధాన్, సింధుబాద్ వంటి చిత్రాల్లో స్మాల్ రోల్స్ లో కనిపించాడు. ఫీనిక్స్ తో హీరోగా డెబ్యు చేస్తున్నారు.

ఈరోజు విడుదలైన రెండవ సింగిల్ “ఇంధ వంగికో”, సామ్ సిఎస్ స్వరపరిచిన పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. బాబా భాస్కర్ కోరియోగ్రఫీ, వెల్‌రాజ్ అందించిన కలర్ ఫుల్ విజువల్స్, సూర్య సేతుపతి ఎనర్జిటిక్ డ్యాన్స్ తో పాట సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

విజయ్ సేతుపతి స్వయంగా ఈ పాటను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఇది అభిమానుల్లో మరింత ఆసక్తిని కలిగించింది.

పవన్ తోలు తీస్తాం || Analyst Ks Prasad Reacts On Actor Sathyaraj Strong Warning To Pawan Kalyan ||TR