తేజ సజ్జా ‘హను-మాన్’ నుంచి సూపర్ హీరో హనుమాన్ నవంబర్ 14న విడుదల

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘హను-మాన్‌’. ట్యాలెంటెడ్ హీరో తేజ సజ్జా హీరోగా నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి సిద్ధంగా ఉంది. సినిమా థియేట్రికల్ విడుదలకు సరిగ్గా రెండు నెలల సమయం వుండగా మేకర్స్ కొత్త పాటకు సంబంధించిన అప్‌డేట్‌తో వచ్చారు.

సూపర్ హీరో హనుమాన్ పాట బాలల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న సాయంత్రం 5:04 గంటలకు విడుదల కానుంది. విజువల్ ప్రెజెంటేషన్ పరంగా ఇది ఎక్సయిటింగ్ ఫ్యాన్సీ నెంబర్ గా ఉంటుంది. సాంగ్ పోస్టర్‌లో తేజ సజ్జ షేడ్స్‌లో స్టైలిష్ అవతార్‌లో కనిపించారు. అతని నోటిలో క్రాకర్ వుంది. భుజంపై ఒక కోతి కూర్చుని ఉంది. పోస్టర్‌లో మాస్క్‌లు ధరిస్తూ కొందరు కనిపించారు. పోస్టర్‌లో పండుగ కళ ఉట్టిపడింది.

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ త్రయం సంగీతం అందించగా, శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ మాగ్నమ్ ఓపస్‌కి సినిమాటోగ్రఫీ శివేంద్ర. ప్రొడక్షన్ డిజైనర్ శ్రీనాగేంద్ర తంగాల.

ఈ చిత్రంలో తేజ సజ్జ సరసన అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా, వినయ్ రాయ్ విలన్‌గా, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న మొదటి సినిమా హను-మాన్. హను-మాన్ “అంజనాద్రి” ఊహాత్మక ప్రదేశంలో సెటప్ చేయబడింది. సినిమా కాన్సెప్ట్ యూనివర్సల్‌గా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా మంచి విజయం సాధించే అవకాశం ఉంది.

హనుమాన్ జనవరి 12, 2024న తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్‌ విడుదల కానుంది.

తారాగణం: తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి తదితరులు

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
నిర్మాత: కె నిరంజన్ రెడ్డి
బ్యానర్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్
సమర్పణ: శ్రీమతి చైతన్య
స్క్రీన్‌ప్లే: స్క్రిప్ట్స్‌విల్లే
డీవోపీ: దాశరధి శివేంద్ర
సంగీత దర్శకులు: గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్
ఎడిటర్: సాయిబాబు తలారి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అస్రిన్ రెడ్డి
లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి
అసోసియేట్ ప్రొడ్యూసర్: కుశాల్ రెడ్డి, పుష్పక్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల
పీఆర్వో: వంశీ-శేఖర్
కాస్ట్యూమ్ డిజైనర్: లంకా సంతోషి