‘డంకీ’పై హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్… విమానంలో ‘లుట్ పుట్ గయా..’ వీడియో వైరల్

కింగ్ ఖాన్ షారూక్ ఖాన్, సక్సెస్‌పుల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాని కాంబినేషన్‌లో రూపొందిన భారీ చిత్రం ‘డంకీ’పై హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఈ సినిమా వచ్చే వారం విడుదలవుతుంది. సిల్వర్ స్క్రీన్‌పై భావోద్వేగాలతో ప్రేక్షకులను మెప్పించటానికి ఈ సినిమా సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన వీడియో, టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో సినిమాపై అంచనాలను ఆకాశానికి అంటేలా చేశారు మేకర్స్. మూవీ రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్ది ఈ ఎక్స్‌పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. ఫ్యాన్స్, ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలన్ని డంకీ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాయి.

ఈ నేపథ్యంలో సినిమాపై తమ ప్రేమను చాటుకోవటానికి ఏ అవకాశాన్ని కూడా కింగ్ ఖాన్ ఫ్యాన్స్ వదులుకోవటం లేదు. తాజాగా డంకీ డ్రాప్ 2గా విడుదలైన ‘లుట్ పుట్ గయా..’ సాంగ్‌కి సంబంధించిన డాన్సింగ్ వీడియోనే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. వీడియోను గమనిస్తే అందరూ ఎస్ఆర్‌కె ఫ్యాన్ క్లబ్, ఎస్ఆర్‌కె యూనివర్స్ కలిసి విమానంలో డంకీ చిత్రంలోని ‘లుట్ పుట్ గయా..’ పాటను షారూక్ సిగ్నేచర్ స్టెప్పులతో రీ క్రియేట్ చేసి ఆకట్టుకున్నారు. ముంబై పార్క్‌లోరూ కింగ్ అభిమానులు పాటకు డాన్సులు చేయటం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. డమ్మీ విమానం సెట్ వేసి పార్క్ బ్యాక్ డ్రాప్‌లో పాటకు డాన్స్ చేస్తూ అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇది షారూక్‌పై వారికున్న అమితమైన ప్రేమను వ్యక్తం చేస్తుంది.

డంకీ’ చిత్రంలో టాలెంటెడ్ ఆర్టిస్టులు ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతున్నారు. బోమన్ ఇరాని, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ సహా బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ప్రేక్షకుల హృదయాలను దోచుకోనున్నారు. ఏ జియో స్టూడియోస్‌, రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అభిజీత్ జోషి, రాజ్ కుమార్ హిరాణి, క‌ణిక థిల్లాన్ ఈ చిత్రానికి ర‌చ‌యిత‌లు. ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున డిసెంబర్ 21న రిలీజ్ అవుతుంది.