శ్రీవిష్ణు ‘సామజవరగమన’ ఫస్ట్ సింగిల్ విడుదల

శ్రీవిష్ణు కథానాయకుడిగా వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సామజవరగమన’. అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీవిష్ణుకు జోడిగా రెబా మోనికా జాన్ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్‌ వచ్చింది. సినిమా అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని భరోసా ఇచ్చింది.

తాజాగా ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ ‘వాట్ టు డూ’ పాటని విడుదల చేసిన సామజవరగమన మ్యూజికల్ జర్నీని స్టార్ట్ చేశారు మేకర్స్. గోపీ సుందర్ ఈ పాటని అందరికీ కనెక్ట్ అయ్యే క్యాచి ఫుట్ ట్యాపింగ్ నెంబర్ గా కంపోజ్ చేశారు. తనలోని ఫ్రస్టేషన్ ని చెబుతూ కథానాయకుడు పాడుకునే ఈ పాటకు శ్రీమణి అందించిన సాహిత్యం మరో ఆకర్షణగా నిలిచింది. జస్సీ గిఫ్ట్ ఈ పాటని ఎనర్జిటిక్ గా ఆలపించారు. ఈ పాటలో శ్రీవిష్ణు చేసిన మాస్ మూమెంట్స్ అలరించాయి.

భాను బోగవరపు కథను అందించగా, నందు సవిరిగాన సంభాషణలు రాశారు. దర్శకుడు రామ్ అబ్బరాజు స్వయంగా ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాశారు. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల బృందం ఈ చిత్రానికి పని చేస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా, రామ్‌రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్.

మే 18న వేసవి కానుకగా ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది.

తారాగణం: శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్, నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రఘు బాబు, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్, ప్రియ తదితరులు.

సాంకేతిక విభాగం:
అనిల్ సుంకర సమర్పణ
స్క్రీన్ ప్లే & దర్శకత్వం – రామ్ అబ్బరాజు
నిర్మాత – రాజేష్ దండా
సహ నిర్మాత – బాలాజీ గుత్తా
బ్యానర్లు- ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్
కథ – భాను బోగవరపు
డైలాగ్స్ – నందు సవిరిగాన
సంగీతం – గోపీ సుందర్
సినిమాటోగ్రాఫర్ – రాంరెడ్డి
ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్ -బ్రహ్మ కడలి
కాస్ట్యూమ్ డిజైనర్ – లక్ష్మి కిల్లారి
పీఆర్వో – వంశీ శేఖర్

What To Do Lyrical Song | Samajavaragamana Songs | Sree Vishnu, Reba John |Ram Abbaraju |Gopi Sundar