కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ సంయుక్తంగా శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో నిర్మిస్తున్న బడ్డీ కామెడీ ఎంటర్ టైనర్ ‘కిస్మత్’. నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వ దేవ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలో కనిపించనున్నారు. రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రియా సుమన్ కథానాయికగా నటిస్తుండగా, సిహెచ్ భానుప్రసాద్ రెడ్డి సహ నిర్మాత. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని ఇటీవలే విడుదల చేసి సినిమాలోని ప్రధాన పాత్రధారులను పరిచయం చేశారు. ఈరోజు ఈ సినిమా టీజర్‌ను హీరో శ్రీవిష్ణు లాంచ్ చేశారు.
బిగ్ ఫెయిల్యూర్ అయిన ముగ్గురు బడ్డీ దోస్తులు తమ జీవితంలో ఏదైనా అద్భుతం జరగాలని ఆశిస్తుంటారు. విశ్వ దేవ్ హోప్ కోల్పోయి ఉంటాడు, అభినవ్ గోమతం రచయితగా సినిమాల్లోకి ప్రవేశించాలని చూస్తుంటాడు, నరేష్ అగస్త్య రియా సుమన్‌తో ప్రేమలో ఉంటాడు. అనుకోని సంఘటనతో వారి కిస్మత్ (అదృష్టం) ఎలా మారిపోయిందన్నదే తెరపై చూడాలి. శ్రీనాథ్ బాదినేని యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ను ఎంచుకున్నాడు, ఇందులో థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా డైలాగులు యూత్‌ని బాగా ఆకట్టుకుంటాయి. నరేష్ అగస్త్య , అభినవ్ గోమఠం, విశ్వ దేవ్, శ్రీనివాస్ అవసరాల తమ టాప్ పెర్ఫార్మెన్స్ లతో ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి వేదరామన్ శంకరన్ సినిమాటోగ్రఫీ అందించారు. మార్క్ కె రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్ద అసెట్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి విప్లవ్ నైషధం ఎడిటర్. కిస్మత్ నిర్మాతలు సినిమా విడుదల తేదీని త్వరలో అనౌన్స్ చేస్తారు
టీజర్ లాంచ్ ఈవెంట్ లో నరేష్ అగస్త్య మాట్లాడుతూ.. మా టీజర్ లాంచ్ శ్రీ విష్ణు గారు లాంచ్ చేయడం చాలా ఆనందంగా వుంది. ఇలాంటి సినిమాలన్నీ మౌత్ టాక్ వలనే హిట్ అవుతాయి. మీ అందరూ మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. దర్శకుడు శ్రీనాథ్ గారి నుంచి చాలా నేర్చుకున్నాను. జీవితంలో ఒక కష్టాన్ని ఎంత సులువుగా దాటేయోచ్చు ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఈ షూటింగ్ సమయంలో అంతా తనే భరించేవారు. ఈ సినిమా నవంబర్ లో విడుదలౌతుంది.అందరూ సపోర్ట్ చేయాలి’’ అని కోరారు.
అభినవ్ గోమఠం మాట్లాడుతూ.. ఈ సినిమా షూటింగ్ ని ప్రతి రోజు ఎంజాయ్ చేశాం. దీనికి మొదటి కారణం దర్శకుడు శ్రీనాథ్ అండ్ టీం. చాలా మంచి స్క్రిప్ట్ రాశారు. చాలా సరదాగా షూట్ చేశాం. ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాకి కిస్మత్ అనే పేరు పెట్టడానికి కారణం ఆ పాత్రల్లో మస్త్ కిస్మత్ వుంది.భాను గారు, రాజు గారి కిస్మత్ కూడా బావుంది. ఇది చాలా మంచి క్రైమ్ కామెడీ. రెండు గంటల పాటు హాయిగా నవ్వుకుంటారు’’ అన్నారు.
విశ్వ దేవ్ మాట్లాడుతూ.. ఇది మంచి ఫన్ ఫిల్మ్ . క్రైమ్ కామెడీ ని చాలా ఎంజాయ్ చేస్తారు. పెర్ఫార్మెన్స్ లు చాలా బావుంటాయి. అందరినీ యంగేజ్ చేస్తుంది. శ్రీనాథ్ గారు చాలా క్లారిటీ వున్న దర్శకుడు. ఈ సినిమా తర్వాత అందరి కిస్మత్ లు నెక్స్ట్ లెవల్ కి వెళ్లాలని కోరుకుంటున్నాను’’
దర్శకుడు శ్రీనాథ్ బాదినేని మాట్లాడుతూ.. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ నిర్మాతలకు కృతజ్ఞతలు. రాజు గారు నేను దాదాపు రెండేళ్ళు స్క్రిప్ట్ పైనే వర్క్ చేశాం. అందుకే సినిమా ఇంత బాగా వచ్చింది. ఆయన చాలా ప్యాసినేట్ ప్రొడ్యుసర్. యువ ప్రతిభని ప్రోత్సహిస్తారు. అలాగే భాను గారు కూడా చాలా పాజిటివ్ వైబ్ ఇచ్చారు. మా టెక్నికల్ టీం కి పేరుపేరునా థాంక్స్. నరేష్ అగస్త్య, అభినవ్, అవసరాల శ్రీనివాస్, విశ్వ దేవ్ అందరూ అద్భుతంగా పెర్పార్మ్ చేశారు. ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది.
బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. నిర్మాత రాజు నాకు ఫ్యామిలీ ఫ్రెండ్. ఇది స్క్రిప్ట్ మొదలైనప్పటినుంచి నాకు తెలుసు. నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వ దేవ్, అవసరాల శ్రీనివాస్ ఇలాంటి మంచి తారాగణంతో ఈ సినిమా చేస్తున్నారని తెలిసి చాలా సంతోషపడ్డాను. ఈ కథకు వాళ్ళు తప్పకుండా న్యాయం చేస్తారు. ఈ సినిమా షో చూసినప్పుడు .. ఇది థియేటర్ సినిమా అని నిర్మాతకు చెప్పాను. యూత్ కి కనెక్ట్ అయ్యే సినిమా. సినిమా అంతా ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. కిస్మత్ టీం అందరికీ మంచి కిస్మత్ ని ఇస్తుందనే నమ్మకం వుంది’’ అన్నారు.
భాను ప్రసాద్ మాట్లాడుతూ.. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ మొదటి సినిమా ఇది. నిర్మాత రాజు గారు, దర్శకుడు దాదాపు మూడేళ్ళు పాటు ఈ ప్రాజెక్ట్ కోసం కష్టపడ్డారు. స్క్రీన్ పైకి అద్భుతంగా తీసుకొచ్చారు. నరేష్ అగస్త్య, అభినవ్ , శ్రీనివాస్ అవసరాల, అజయ్ ఘోష్ ఇలాంటి అద్భుతమైన నటులు ఇందులో చక్కని పాత్రలలో అలరించారు. ఈ ప్రయాణంలో మాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. అందరి ఆశీర్వాదంతో ఈ సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను.
తాగుబోతు రమేష్ మాట్లాడుతూ.. నాకు కిస్మత్ వుంది కాబట్టే ఇందులో నటించాను. శ్రీనాథ్ మంచి టైమింగ్ వున్న దర్శకుడు. చాలా పెద్ద దర్శకుడు అవుతాడు. నరేష్ అగస్త్య, అభినవ్ గోమతం, అవసరాల శ్రీనివాస్, విశ్వ దేవ్ అంతా సహజంగా నటించారు. సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.
తారాగణం: నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, అవసరాల శ్రీనివాస్, విశ్వ దేవ్, రియా సుమన్, అజయ్ ఘోష్, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర, రచ్చ రవి
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: శ్రీనాథ్ బాదినేని
నిర్మాత: రాజు
సహ నిర్మాత: సిహెచ్ భానుప్రసాద్ రెడ్డి
బ్యానర్లు: కామ్రెడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్
డీవోపీ: వేదరామన్ శంకరన్
సంగీతం: మార్క్ కె రాబిన్
ఎడిటర్: విప్లవ్ నైషధం
ఆర్ట్: రవి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: భరత్ రెడ్డి
పీఆర్వో: వంశీ-శేఖర్