నరేష్ అగస్త్య, విపిన్ ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’ నుంచి ‘సౌండ్ అఫ్ లవ్’ సాంగ్ రిలీజ్

Meghalu Cheppina Prema Katha: యంగ్ హీరో నరేష్ అగస్త్య, దర్శకుడు విపిన్ దర్శకత్వంలో, సునేత్ర ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఉమా దేవి కోట నిర్మించిన మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు టీజర్లు సినిమాపై అంచనాలను పెంచాయి. చిత్రంలో రబియా ఖతూన్ కథానాయిక. ఫస్ట్ సింగిల్ “సౌండ్ ఆఫ్ లవ్” విడుదలతో మేకర్స్ మ్యూజిక్ జర్నీ ప్రారంభించారు.

జస్టిన్ ప్రభాకరన్ “సౌండ్ ఆఫ్ లవ్”ని మనసుని కదిలించే సాంగ్ గా కంపోజ్ చేశారు. అన్నీ సహజమైన శబ్దాలతో ఈ సాంగ్ ని కంపోజ్ చేయడం విశేషం. గొప్ప ఆర్కెస్ట్రేషన్ తో ఈ పాట క్లాసిక్ రొమాంటిక్ మ్యూజిక్ ఎసెన్స్ ని అందించింది,

‘సౌండ్ ఆఫ్ లవ్’ కు రెహ్మాన్ పొయిటిక్ సాహిత్యం ఆకట్టుకుంది. ఎస్పీబీ చరణ్, షాషా తిరుపతి వాయిస్ లు మ్యాజికల్ గా వున్నాయి. విజువల్ గా పాట అద్భుతంగా వుంది. నరేష్ అగస్త్య, రబియా ఖటూన్ కెమిస్ట్రీ హార్ట్ ఫుల్ గా వుంది.

మోహన కృష్ణ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, తోట తరణి ఆర్ట్ డైరెక్టర్‌ కాగా మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్.

‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’ మేకర్స్ ఈ చిత్రాన్ని త్వరలో థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

తారాగణం: నరేష్ అగస్త్య, రబియా ఖాతూన్, రాధిక శరత్‌కుమార్, తనికెళ్ల భరణి, వెంకటేష్ కాకుమాను, విద్యుల్లేఖ, సుమన్, ఆమని, తులసి, చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ కార్తికేయ, మోహన్ రామన్ .

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం – విపిన్
నిర్మాత – ఉమాదేవి కోట
బ్యానర్ – సునేత్ర ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్
సినిమాటోగ్రాఫర్ – మోహన కృష్ణ
సంగీతం – జస్టిన్ ప్రభాకరన్
ఆర్ట్ – తోట తరణి
ఎడిటర్ – మార్తాండ్ కె వెంకటేష్
పీఆర్వో: వంశీ-శేఖర్

రేవంత్ తో అల్లు అర్జున్ || Allu Arjun Interesting Comments About CM Revanth Reddy || Pushpa2 || TR