తెలుగులో అనేక విభిన్న సినిమాలు నిర్మించి సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు అందుకుంది. GA2 పిక్చర్స్ బ్యానర్. ఈ బ్యానర్ ద్వారా భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలు నిర్మించగా కొన్ని ఇతర భాషలు సినిమాలను కూడా తెలుగులో రిలీజ్ చేసి సక్సెస్ లనుఅందుకున్నారు.
ఈ సినిమాకి నిర్మాతలుగా బన్నీ వాస్, విద్యా కొప్పినీడి వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ మేక ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన శ్రీకాకుళం మాస్ సెన్సేషనల్ సాంగ్ “లింగి లింగి లింగిడి” సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎవరు ఊహించని రీతిలో దూసుకుపోతుంది.
ఫేమ్ పి.రఘు సాహిత్యం అందించడంతోపాటు స్వయంగా పాడిన తీరు అందర్నీ ఆకర్షిస్తుంది. .ఈ పాటతో సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరాయి. *జోహార్, *అర్జున ఫాల్గుణ* వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపునందుకున్న తేజ మార్ని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ పాట సక్సెస్ సెలబ్రేషన్స్ సందర్భంగా
నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ: ఒక పాట హిట్ అయితే సక్సెస్ మీట్ చేయడం మాకు తెలిసింది ఫస్ట్ టైం అనుకుంటా ఈ సాంగ్ ఎలా ఉందంటే సోషల్ మీడియాలో 5000 రూల్స్ తో ట్రెండింగ్ లో ఉంది 14 మిలియన్ ఇంస్టాగ్రామ్ న్యూస్ తో తీసుకుపోతుంది తెలుగోడి జానపదం దమ్ము ఇది మీ అందరూ సపోర్ట్ చేస్తే జానపదాన్ని ఎక్కడకు తీసుకెళ్లొచ్చు.
శ్రీకాంత్ మాట్లాడుతూ : ఈ సినిమా నాకు రావడం చాలా హ్యాపీ గా ఫీల్ అవుతున్నా, చాలాకాలం తర్వాత ఇంత మంచి సినిమా చేశానని ఫీల్ ఉంది ఇలాంటి సినిమా GA 2 పిక్చర్స్ తప్ప ఎవరూ చెయ్యరు..
రాహుల్ విజయ్ మాట్లాడుతూ: నేను నాలుగు సినిమాలు చేశాను సక్సెస్ మీట్ అనేదే లేదు .కానీ GA 2 పిక్చర్స్ ఒక్క పాటకే సక్సెస్ మీట్ పెట్టారు . నా లైఫ్ లో గుర్తుండిపోయే పాట వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న..
శివాని రాజశేఖర్ మాట్లాడుతూ : ఈ సాంగ్ వైరల్ అవ్వడం హ్యాపీ గా ఉంది అది నా సాంగ్ అవ్వడం చలా చలా హ్యాపీ గా ఉంది సాంగ్ ఎంత వైరల్ అయ్యిందో రిలీజ్ అయ్యాక సినిమా కూడా అంతే విధంగా ఉంటుంది….
ఈ సందర్భంగా డైరెక్టర్ తేజ మార్ని మాట్లాడుతూ : నా సినిమాలో జానపద పాట పెట్టాలి అనేది నా డ్రీమ్ . సినిమాలో ఈ పాట కాదు ప్రతి సీన్ అదిరిపోతుంది . ఈ సాంగ్ సక్సెస్ సెలబ్రేషన్ లో తదితరులు పాల్గొన్నారు
తారాగణం: శ్రీకాంత్ మేక, వరలక్ష్మి శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ మరియు అనేక ఇతర ప్రముఖ నటీనటులు
సాంకేతిక సిబ్బంది:
దర్శకుడు: తేజ మార్ని
ప్రొడక్షన్: GA2 పిక్చర్స్
నిర్మాతలు: బన్నీ వాస్, విద్యా కొప్పినీడి
సహ నిర్మాతలు: భాను ప్రతాప, రియాజ్ చౌదరి
డోప్: జగదీష్ చీకాటి
డైలాగ్స్: నాగేంద్ర కాశి
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
ఆర్ట్ డైరెక్టర్: గాంధీ నడికుడికర్
సంగీత దర్శకుడు: రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అజయ్ గద్దె
కాస్ట్యూమ్ డిజైనర్: అపూర్వ రెడ్డి
కో-డైరెక్టర్: రామ్ నరేష్
పిఆర్ఓ : ఏలూరు శీను , మడూరి మధు